మ‌హేష్ హీరోయిన్‌.. ఇంకా ఫిక్స్ అవ్వ‌లేద‌ట‌

మ‌హేష్ బాబు – ప‌ర‌శురామ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా సెట్ట‌య్యింది. మైత్రీ మూవీస్‌, 14 రీల్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జూన్ లేదా జులైలో ఈ సినిమా ప‌ట్టాలెక్కే ఛాన్సుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా చాలా మంది పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కీర్తి సురేష్‌, జాన్వీక‌పూర్‌, ర‌ష్మిక‌.. ఇలా ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ పేరు కూడా చేరింది. మ‌హేష్ ప‌క్క‌న బాలీవుడ్ భామ‌నే రంగ ప్ర‌వేశం చేయిస్తార‌ని, సారా మ‌హేష్‌కి స‌రిజోడీ అని కొన్ని వెబ్ సైట్లు, ప‌త్రిక‌లు క‌థ‌నాలు అల్లేస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేద‌ట‌. ప్ర‌స్తుతం ప‌రశురామ్ డైలాగ్ వెర్ష‌న్‌తో బిజీగా ఉన్నార‌ని, అది పూర్త‌య్యాక మ‌హేష్‌కి ఫైన‌ల్ నేరేష‌న్ ఇస్తార‌ని, ఆ త‌ర‌వాతే హీరోయిన్ విష‌యాన్ని ఆలోచిస్తార‌ని చిత్ర‌బృందంలో కీల‌క స‌భ్యుడొక‌రు తెలిపారు. మ‌హేష్ కూడా ఇప్పుడు ప‌ర‌శురామ్‌ని గానీ, చిత్ర‌బృందాన్ని గానీ ఏమాత్రం తొంద‌ర‌పెట్ట‌డం లేద‌ట‌. ఎలాగూ లాక్ డౌన్ అమ‌లులో ఉంది కాబ‌ట్టి, ప‌నుల‌న్నీ మెల్ల‌గా చేయ‌మ‌ని, వీలైనంత స‌మ‌యం తీసుకోమ‌ని చెబుతున్నాడ‌ట‌. అవును.. మ‌హేష్ దృష్టంతా ఇప్పుడు కుటుంబంతో గ‌డ‌ప‌డంపైనే ఉంది. అందుకే సినిమాల గురించి పెద్ద‌గా ఆలోచించ‌డం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గ్రేటర్ సమస్యలపై కేటీఆర్‌ని టార్గెట్ చేస్తున్న రేవంత్..!

తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల రాజకీయం రాజుకుంది. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో అంచనా వేయడం కష్టం కానీ.. రాజకీయ నేతలు మాత్రం.. వచ్చిన ఏ అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. గ్రేటర్ పరిధిలో...

ఠాగూర్ అయినా టీ కాంగ్రెస్‌లో అందర్నీ కలపి ఉంచగలరా..!?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా కుంతియా స్థానంలో మాణిగం ఠాగూర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఆయన తెలంగాణలో అడుగు పెట్టి..ఓ సారి సమావేశం కూడా నిర్వహించారు. కాంగ్రెస్ నేతలు.. అందరూ ఆయన ఎదుట...

వైసీపీ శ్రేయోభిలాషులకు బీజేపీలో ప్రాధాన్యత తగ్గినట్లేనా..!?

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం కూర్పు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించింది. రామ్‌మాధవ్, మురళీధర్ రావు లాంటి వాళ్లను పక్కన పెట్టడం... తేజస్వి సూర్య లాంటి వారికి పట్టం కట్టడమే దీనికి...

అంబటి రాంబాబుపై వివాదాలన్నీ రేసు నుంచి తప్పించడానికేనా..!?

అంబటి రాంబాబు వైసీపీలో అత్యంత వివాదాస్పదమైన నాయకుల్లో ఒకరుగా మారుతున్నారు. ఆయన వరుసగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు. ఆయనపై వస్తున్న ఆరోపణలన్నీ సొంతపార్టీ నేతలు చేస్తూండటమే ఇందులో ట్విస్ట్. మరో ఏడాదిలో జరగనున్న మంత్రి...

HOT NEWS

[X] Close
[X] Close