ఒక్క రోజే 75 పాజిటివ్ కేసులు.. తెలంగాణ కౌంట్ 229..!

తెలంగాణలో ఒక్క రోజే 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 229కి చేరాయి. అదే సమయంలో.. మరో ఇద్దరు చనిపోయారు. దీంతో కరోనా కారణంగా తెలంగాణలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అయితే.. వైద్యుల కృషితో పదిహేను మందికి నెగెటివ్ వచ్చింది. వారందర్నీ డిశ్చార్జ్ చేశారు. అంటే ప్రస్తుతం తెలంగాణ ఆస్పత్రుల్లో 186 మంది కరోనా పాజిటివ్‌కు చికిత్స పొందుతున్నారు. కొత్తగా వెలుగు చూసినా కరోనా పాజిటివ్ కేసులన్నీ ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇలా వెళ్లి వచ్చిన వారందర్నీ ప్రభుత్వం గుర్తించిందని.. వారందర్నీ క్వారంటైన్ కు తరలించామని అధికారవర్గాలు చెబుతున్నాయి. చనిపోయిన ఇద్దరు కూడా… మర్కజ్ సమావేశాలకు వెళ్లిన వారేనని తెలుస్తోంది. వారితో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణలో ఇప్పటి వరకూ 32 మంది కరోనా పాజిటివ్ వ్యక్తులకు చికిత్స ద్వారా నెగెటివ్ వచ్చింది. ఇది కూడా ఓ రికార్డే. ఇంకా పెద్ద ఎత్తున కరోనా అనుమానితులు, మర్కజ్ ప్రార్థనలకు వెళ్లిన వారి శాంపిళ్లు ల్యాబుల్లో ఉన్నాయి. వాటిని పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం.. ఢిల్లీ మర్కజ్ కు వెళ్లిన వారికి సగటున… ప్రతి ముగ్గురిలో ఒకరికి కరోనా వైరస్ బయటపడుతోంది కాబట్టి.. ఈ సంఖ్య ఇంకా ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో.. వీరి కాంటాక్ట్ కేసులు కూడా.. అంతకు మించి పెరుగుతున్నాయి. మర్కజ్ ప్రార్థనల విషయం బయటకు రాక ముందు కేసీఆర్.. ఏప్రిల్ ఏడో తేదీ కల్లా… కరోనా ఫ్రీ స్టేట్‌గా తెలంగాణను చూడాలని అనుకున్నారు.

అయితే.. అలా ప్రకటన చేసిన రోజే… ఇలా ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఆరుగురు చనిపోయారు. దీంతో.. ఒక్క సారిగా గందరగోళం ప్రారంభమయింది. ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారందరికీ టెస్టులు చేస్తున్నారు. వారితో కాంటాక్టులో ఉన్న వారికీ టెస్టులు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తమిళనాడులో వందకుపైగా పాజిటివ్ కేసులు మర్కజ్ కు వెళ్లి వచ్చిన ద్వారానే ఒక్క రోజులో వెలుగు చూశాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్‌: ఈనాడులో గంద‌ర‌గోళం

తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకుని, త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌డంలో ఈనాడుకి తిరుగులేదు. ప‌దేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవ్వ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌. అయితే...

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ” అనంత పద్మనాభుని” బాధ్యతలు..!

దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అలాగే త్రివేండ్రం...

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టేస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

HOT NEWS

[X] Close
[X] Close