వ్యాపారానికి వైరస్ : స్టాక్‌మార్కెట్లు మళ్లీ కోలుకుంటాయా..?

కోవిడ్ -19 ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కంపెనీల ఆర్థిక మూలాల్ని పెకిలించివేస్తోంది. ఉత్పాదక కార్యకలాపాలు నిలిచిపోవడం.. ఇక ముందు డిమాండ్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం కావడం వంటి వాటితో భవిష్యత్ భయం ఉండటమే కాదు.. స్టాక్ మార్కెట్లలో వారి సంపదవిలువ అమాంతం కరిగిపోయింది. గత ఆర్థిక సంవత్సరం చాలా కాలం పాటు స్టాక్ మార్కెట్లలో సూచీలు.. వాటి ద్వారా కుబేరుల సంపద అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి. కానీ జనవరిలో ఎప్పుడైనా కోవిడ్ -19 చైనాలో ప్రభావం చూపడం ప్రారంభమయిందో.. అప్పుడే.. స్టాక్ మార్కెట్లకు అసలు సినిమా ప్రారంభమయింది.

రూ. 38 లక్షల కోట్ల సంపద ఆవిరి..!

ఫిబ్రవరి నుంచి స్టాక్ మార్కెట్ కుప్పకూలే దశలోనే ఉంది. ఒక రోజు.. రూ. ఏడు లక్షల కోట్లు.. ఓ రోజు.. రూ. ఎనిమిది లక్షల కోట్లు.. ఇలా లక్షల కోట్లలోనే సంపద ఆవిరి అవుతూనే ఉంది. తర్వాత అడపాదడపా కోలుకున్నప్పటికీ.. కరిగిపోయిన వాటితో పోలిస్తే.. అది చాలా మొత్తం. మొత్తంగా.. ఆర్థిక సంవత్సం ముగిసే నాటికి.. స్టాక్ మార్కెట్ 24 శాతం సంపదను కోల్పోయింది. ఈ మొత్తం రూ. 38 లక్షల కోట్లు ఉంటుంది. ఈ మొత్తం.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టినవారిదే. భారీ లాభాలతో… తన స్టాక్ వాల్యూను అంతకంతకూ పెంచుకుంటూ పోయి.. బిలియనీర్లుగా మారిపోయిన వారు.. తర్వాత తమ రేంజ్‌నుతగ్గించుకోవాల్సి వచ్చింది.

ఫిబ్రవరి తర్వాతే స్టాక్ మార్కెట్లకు రాహుకాలం..!

వ్యాపార, ప్రభుత్వాలకు సంబంధించి ప్రపంచంలో ఎక్కడ ఎవరు తుమ్మినా.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడిదారులు తమ సొమ్మును వెనక్కి తీసుకోవడానికి కాచుకుని కూర్చుంటారు. అలాంటిది కరోనాతో తుమ్మితే ఊరుకుంటారా..? ఎంత దొరికితే..అంత తమ పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు వెనుకాడలేదు. నిజానికి గత ఆర్థిక సంవత్సరం అంతా.. స్టాక్ మార్కెట్లకు మంచి రోజులే ున్నాయి. జనవరి 20వ తేదీన సెన్సెక్స్ 42273 పాయింట్లతో ఆల్ టైం హైను చూసింది. కానీ అదృష్టానికి అదే లాస్ట్ రోజు. చివరికి 25వేల పాయింట్ల దగ్గర ఆర్థిక సంవత్సరం ముగిసింది. అంటే.. రెండు నెలల్లోనే ఎంత దారుణమైన పతనమో సులువుగా అర్థం చేసుకోవచ్చు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇక వస్తాయా..?

స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్ పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున నష్టపోయారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్న పెట్టుబడులను మళ్లీ ఇండియాలో పెట్టే అవకాశాలు లేవు. వాళ్లు భారత్‌ వైపే కాదు..కరోనా కాటు ఎంత తీవ్రంగా ఉంటుందో తేలే వరకూ.. పెట్టుబడులు ఎక్కడా పెట్టరు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ల జోలికి వెళ్లాలని ఎవరూ ఆనుకోరు. సంపద అంతంకతంకూ తగ్గడం ఖాయమో. ఇప్పుడు ఉన్నంత వరకైనా కాపాడుకుంటే గొప్పే. కానీ.. కంపెనీల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటే… ఆ ప్రభావం.. మళ్లీ స్టాక్ మార్కెట్‌పై పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

ఫ్లాష్ బ్యాక్‌: సూప‌ర్ స్టార్స్ అడిగితే సినిమా చేయ‌నన్నారు

ఓ స్టార్ హీరో పిలిచి - ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇస్తే, కాదంటాడా? చేయ‌నంటాడా? ఎగిరి గంతేస్తాడు. త‌న ద‌గ్గ‌ర క‌థ లేక‌పోయినా అప్ప‌టిక‌ప్పుడు వండేస్తాడు. మీతో సినిమా చేయ‌డంతో నా జ‌న్మ ధ‌న్యం అంటాడు....

భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా...

రాయలసీమ ఎత్తిపోతల భవితవ్యం ఏపీ సర్కార్ చేతుల్లోనే..!

సంగమేశ్వరం వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు జీవో ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు కారణంగా వచ్చిన వివాదాల విషయంలోనూ అంతే పట్టుదల ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కొత్త ప్రాజెక్ట్...

HOT NEWS

[X] Close
[X] Close