రోడ్లు, డాక్టర్లు .. డెడ్ లైన్లు – ప్రకటనలే పాలన !

ఏపీ సీఎం జగన్ అధికారులతో చేసే సమీక్షల్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ.. ఎడిటింగ్ చేసిన వీడియోలు విడుదల చేస్తారు. ఓ ప్రెస్ నోట్ మాత్రం వస్తుంది. అ ప్రెస్‌నోట్‌లో ఏ శాఖకు చెందినదయితే.. అది గత మూడేళ్ల కిందట ఏముందో..అందులో కొంచెం కొంచె మార్పులతో ఇప్పటికీ ఇస్తూంటారు. అలా చేస్తాం.. ఇలా చేస్తాం… సీఎం ఆదేశించారని చెబుతూంటారు కానీ.. ఒక్క పనీ ముందుకు సాగదు. తాజాగా ఫ్యామిలీ డాక్టర్లంటూ హడావుడి చేసి .. ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని జగన్ పదే పదే చెప్పారు. చివరికి ఆగస్టు పదిహేను వచ్చింది కానీ ఎవరూ పట్టించుకోలేదు.

సీఎం మాటనే పట్టించుకోరా అని ప్రజలు ఆశ్చర్యపోయారు. నిజానికి సమీక్షలో అలా చెబుతారు కానీ.. దానికి తగ్గట్లు చర్యలను ఎవరూ పట్టించుకోరు. రకరకాల అడ్డంకులు వస్తాయి. అందరూ లైట్ తీసుకుంటారు. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ కూడా అంతే. టీడీపీ హయాంలో .. గ్రామాల్లో సేవలందించడానికి మొబైల్ హాస్పిటల్స్ ను ప్రారంభించారు. వాటిని మరింత విస్తృత పరిచి .. కేంద్రం ఇస్తున్న నిధులతో హెల్త్ క్లీనిక్‌లు నిర్మించి .. అందులో వైద్యులను నియమించాలనుకున్నారు. కానీ ఆ పనులేమీ చేయలేదు. సీఎం డెడ్ లైన్ పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. చివరికి ఇప్పుడు మళ్లీ సంక్రాంతి నుంచి ప్రారంభిస్తామనే మాటలు చెబుతున్నారు.

ఈ ఒక్క విషయం మాత్రమే కాదు… ప్రతి విషయంలోనూ అదే తంతు. రోడ్ల గురించి జూలై పదిహేను డెడ్ లైన్ పెట్టారు. కానీ సీఎం చెప్పిన మాటను పట్టించుకోవాల్సిన అవసరం ఏముందని అధికారులు మిన్నకుండిపోయారు. సీఎం కూడా అడగలేదు. అడిగితే.. నిధులేవీ అంటారు మరి. పాలన కేవలం.. ప్రకటనల కోసమే అన్నట్లుగా సాగుతోందని… అసలు మాటలకు.. చేతలకు పొంతనే ఉండదని అధికార వర్గాలు కూడా గుసగులాడుకుంటున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

5 నెలల్లో రూ. 40వేల కోట్లు గల్లంతయ్యాయట !

ఏపీ బడ్జెట్ నిర్వహణ గురించి ప్రత్యేకంగా సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన పని లేదు. బడ్జెట్ వ్యవహారం ఇప్పుడు కూడా నడుస్తోంది. ఈ ఐదు నెలల్లో రూ. నలభైవేల కోట్లకుపైగా లెక్కలు తెలియడం లేదని గగ్గోలు...

‘గాడ్ ఫాద‌ర్‌’ హిట్‌… నాగ్ హ్యాపీ!

ఈ ద‌స‌రాకి మూడు సినిమాలొచ్చాయి. గాడ్‌ఫాద‌ర్‌, ది ఘోస్ట్‌, స్వాతిముత్యం. గాడ్ ఫాద‌ర్‌కి వ‌సూళ్లు బాగున్నాయి. స్వాతి ముత్యంకి రివ్యూలు బాగా వ‌చ్చాయి. ది ఘోస్ట్ కి ఇవి రెండూ లేవు....

వైసీపీ సర్పంచ్‌ల బాధ జగన్‌కూ పట్టడం లేదు !

వారు వైసీపీ తరపున సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పార్టీనో.. సొంత పార్టీలో ప్రత్యర్థుల్నో దెబ్బకొట్టడానికి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు. గెలిచారు. కానీ ఇప్పుడు వారికి అసలు సినిమా కనిపిస్తోంది. వీధిలైట్...

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..

చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు.. ఇప్పుడు బంతి... వాళ్లిద్ద‌రి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవ‌డ‌మే త‌రువాయి. అవును... అల‌య్ బ‌ల‌య్‌... కార్య‌క్ర‌మంలో చిరంజీవి - గ‌రిక‌పాటి మ‌ధ్య ఏం జ‌రిగిందో తెలిసింది. చిరుని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close