మ‌ణిర‌త్నం సినిమాలో చిరంజీవి?

మ‌ణిర‌త్నం ఓ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు. హిట్లు, ఫ్లాపులు ఎన్న‌యినా రానివ్వండి.. ఆయ‌న మార్క్ ఆయ‌న‌దే. ఎంత ఫ్లాప్ సినిమా అయినా… ‘మ‌ణి ఈ సీన్ భ‌లే తీశాడ్రా..’ అనో ‘మ‌ణి ఈ షాట్ భ‌లే పెట్టాడ్రా’ అనో అనిపిస్తుంది. అదీ ఆయ‌న స్టైల్‌.. అదీ ఆయ‌న ముద్ర‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని చాలామంది కి ఉంటుంది. కానీ.. ఆ అవ‌కాశం కొద్దిమందికే ద‌క్కుతుంది. చిరంజీవి లాంటి మెగాస్టార్ల‌కే ఆ ఛాన్స్ రాలేదు. అయితే ఇన్నేళ్ల‌కు మ‌ణిర‌త్నం సినిమాలో ఆయ‌న భాగం పంచుకొన్నారు. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం `పొన్నియ‌న్ సెల్వన్‌`. కార్తి, విక్ర‌మ్, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్యరాయ్‌.. ఇలా బ‌డా స్టార్ గ‌ణం ఉంది ఈ సినిమాలో. సెప్టెంబ‌రు 30న వ‌స్తోంది. ఈ సినిమాలో ప‌రోక్షంగా చిరు ప‌నిచేశారు. అదేమిట‌న్న‌ది ప్ర‌స్తుతానికైతే స‌స్పెన్స్‌. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ ఈవెంట్ ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మ‌ణిర‌త్నం మాట్లాడుతూ.. చిరంజీవికి థ్యాంక్స్ చెప్పుకొన్నారు. ”చిరంజీవి గారికి థ్యాంక్స్‌. కానీ నేను ఆయ‌న‌కు థ్యాంక్స్ ఎందుకు చెబుతున్నానో ఇప్పుడే చెప్ప‌ను..” అని కాస్త స‌స్పెన్స్ లో పెట్టేశారు. బ‌హుశా ఈ సినిమాలో ఆయ‌న వాయిస్ ఓవ‌ర్ ఇచ్చి ఉండొచ్చు. అలాగైనా మ‌ణిర‌త్నం సినిమాలో చిరు భాగం పంచుకొన్న‌ట్టే. ఈ సంద‌ర్భంగా.. మ‌ణిర‌త్నం రాజ‌మౌళికి కూడా థ్యాంక్స్ చెప్పారు. రాజ‌మౌళి వ‌ల్లే.. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి ధైర్యం వ‌చ్చింద‌న్నారు మ‌ణిర‌త్నం. ఈ సినిమాని మ‌ణిర‌త్నం భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. తెలుగులోనూ బాగా ప‌బ్లిసిటీ చేద్దామ‌నుకుంటున్నారు. అందుకే చిరు, రాజ‌మౌళిల‌ను రంగంలోకి దించిన‌ట్టు ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సోషల్ మీడియాలోనూ దారి తప్పిన ఏపీ రాజకీయాలు !

తమలపాకుతో నువ్వకొటి అంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అన్నట్లుగా ఏపీలో రెండు పార్టీల నేతలూ.. సోషల్ మీడియా కార్యకర్తలు చెలరేగిపోతున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రెండు పార్టీలకు...

మిడిల్ డ్రాప్ … దసరాకు కేసీఆర్ జాతీయ పార్టీ లేనట్లే !

ఇతర రాష్ట్రాల నుంచి సీనియర్ నతలు వస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరం అని పొగుడుతున్నారు. వెళ్తున్నారు. ఇక టీఆర్ఎస్ నేతల సంగతి చెప్పాల్సిన పని లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎప్పుడు...

ఏపీలో పోటాపోటీ పోస్టర్లు .. భారతీ పే !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గోడలకెక్కుతున్నాయి. గతంలో చంద్రబాబు వియ్ డోంట్ నీడ్ ఎన్టీఆర్ అని అన్నారంటూ... ఓ ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన వార్తను పెద్ద పెద్ద పోస్టర్లు చేసి వైసీపీ నేతలు...

వైసీపీ హైకమండ్‌లోనూ “ఐప్యాక్‌”పై అసంతృప్తి !

తెలంగాణ సీఎం కేసీఆర్ ఐ ప్యాక్‌ ను తెలంగాణ నుంచి వెళ్లగొట్టారు. గతంలో గొప్పగా పొగిడారు కానీ ప్రత్యక్షంగా వారి సర్వీసులు అందుకున్న తరవాత... తమ నెత్తి మీద తాము చేయి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close