దాడి చేయడానికి వచ్చిన వాళ్లను కదా అరెస్ట్ చేయాల్సింది..?: హైకోర్టు

ముందస్తు అరెస్ట్ చేయాల్సింది దాడి చేయడానికి వచ్చిన వారిని కానీ.. పర్యటనకు పర్మిషన్ తీసుకున్న వారిని ఎలా అరెస్ట్ చేశారని.. హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చంద్రబాబు విశాఖ పర్యటనను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేతలు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అధికారపక్షానికి ఒక రూల్‌.. ప్రతిపక్షానికి మరో రూల్‌ ఉంటుందా .. చట్టం ముందు అందరూ సమానమే కదా అని హైకోర్టు ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించారు. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన తర్వాత.. 151 కింద నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించింది. ముందస్తు అరెస్ట్‌ చేయాల్సింది రాళ్లు, కోడిగుడ్లు వేయడానికి వచ్చిన వాళ్లని కదా.. ఆందోళనకారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అడగడంతో.. ప్రభుత్వం తరపు న్యాయవాది నోరు విప్పలేకపోయారు.

ఆందోళనలు చేస్తామని చెప్పిన వారిని ఎయిర్‌పోర్టుకు రాకుండా ఎందుకు నిలువరించలేకపోయారని ప్రశ్నించింది. 151 సీఆర్పీసీ నోటీసు చంద్రబాబుకు ఇవ్వటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్థులు, నేరాలు చేసే ఆలోచన ఉన్నవారికి మాత్రమే..151 సీఆర్పీసీ నోటీసు ఇస్తారు కదా.. అని ప్రశ్నించింది. ప్రతిపక్ష నేతకు ఎందుకు షరతులు విధిస్తున్నారని.. ప్రజాస్వామ్య దేశంలో ఇలా చేయటం ఏంటని న్యాయమూర్తి విస్మయం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై.. మార్చి రెండో తేదీలోపు కౌంటర్‌ దాఖలు చేయాలని డీజీపీ, విశాఖ సీపీకి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 2కి వాయిదా వేసింది.

హైకోర్టు విచారణలో ప్రభుత్వం తరపు న్యాయవాది చంద్రబాబును ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చిందో వివరించలేకపోయారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై… హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. చట్ట విరుద్ధంగా చేస్తున్నారంటూ… దాదాపుగా ప్రతీ కేసులోనూ.. విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపైనా.. అదే తరహా విమర్శలు వచ్చాయి. హైకోర్టులో ప్రతీ రోజూ.. ప్రభుత్వానికి సంబంధించిన పిటిషన్లే ఎక్కువగా విచారణకు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రివ్యూ: ‘బొంభాట్‌’

వేర్ ద లాజిక్ స్టార్స్ట్‌... డ్రామా ఎండ్‌, వేర్ ద డ్రామా స్టార్ట్స్ .. లాజిక్ ఎండ్‌ - అని హిచ్ కాక్ అనే ఓ పెద్దాయ‌న చెప్పాడు. లాజిక్‌వేసుకుంటూ వెళ్లిన చోట...

ర‌జ‌నీ మ్యాజిక్ చేయ‌గ‌ల‌డా??

రజనీకాంత్ రాజకీయం ఇప్పటి మాట కాదు. మూడు దశాబ్దాల నుంచి నానుతోంది. కానీ రజనీ మాత్రం ''దేవుడు ఆదేశిస్తాడు' అనే సినిమా డైలాగులతోనే సరిపెట్టేశారు. అయితే ఎట్టకేలకు రజనీ నుంచి పొలిటికల్ పార్టీ...

“తాపీ దాడి” కేసులో కొల్లు రవీంద్రకు నోటీసులు..!

మచిలీపట్నం పోలీసులు తాపీ దాడి కేసును మెల్లగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయనకు సెక్షన్ 91 కింద నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని...

ఏపీ అసెంబ్లీ : రెండో సైడ్ కనిపించకూడదు..! వినిపించకూడదు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసి సభను నిర్వహించారు. రాష్ట్రంలో అమూల్ మిల్క్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ...

HOT NEWS

[X] Close
[X] Close