చైతన్య : రాజకీయ పగ – ప్రతీకారం..! తమిళనాడు – ఆంధ్ర సేమ్ టు సేమ్ ..!

రాజకీయ పగ ప్రతీకారాల్లో.. ఆంధ్రప్రదేశ్.. తమిళనాడును మించిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ఓ పార్టీ పాలనా కాలంలో… ఎదుర్కొన్న అవమానాలకు మరో పార్టీ పాలనా కాలంలో బదులు తీర్చుకోవడం.. తమిళనాడులో కామన్. జయలలిత – కరుణానిధి టైంలో అది రివాజు. ఇప్పుడు అక్కడ పరిస్థితి మారినట్లుగా కనిపిస్తోంది కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం.. పగ- ప్రతీకారాల రేంజ్ మారుతోంది. నిన్న ఎయిర్‌పోర్ట్ ఘటనతో ఇది మరింతగా విస్తృతమవుతోంది.

నాడు ఏం జరిగింది..?

చంద్రబాబును విశాఖ ఎయిర్‌పోర్టు నుండి బయటకు రాకుండా చేయడంలో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. గతంలో జగన్‌ను ఎయిర్‌పోర్టు నుంచి వెనక్కి పంపిన ఘటనతో పోల్చి.. వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతీకారం తీర్చుకున్నామంటున్నారు.. 2017, జనవరి 26..రిపబ్లిక్ డే రోజు విశాఖలో ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు.. ఆర్కే బీచ్‌లో భారీ ప్రదర్శనకు పిలుపునిచ్చారు. అప్పట్లో.. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం జరగడంతో.. ఆ స్ఫూర్తితో పోరాడుతామని ప్రకటనలు చేశారు. దానికి వైసీపీ పార్టీ పరంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. జనసేనతో పాటు ఇతర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. అయితే.. దానికి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం రావడంతో.. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. హోదా ఉద్యమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి.. విశాఖ వచ్చారు. ఆయన ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోలేదు. విశాఖకు ఆ సమయంలో ఎవర్నీ ఆందోళనల కోసం అనుమతించడం లేదని పోలీసులు జగన్ బృందానికి చెప్పారు. అయితే జగన్ బృందం వెళ్తామని పట్టుబట్టింది. అయితే పోలీసులు ఆయనను వెనక్కి పంపారు.

నిన్నేం జరిగింది..?

ఇప్పుడు చంద్రబాబును కూడా.. విమానాశ్రయంలో అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు పర్యటనకు పోలీసుల పర్మిషన్ ఉంది. చంద్రబాబు ఉద్యమాలకు వెళ్లడం లేదు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కూడా లేవు. ఆయన రాజకీయ పరంగా.. ప్రజాచైతన్య యాత్ర చేస్తున్నారు. అందులో భాగంగా పర్యటిస్తున్నారు. ప్రతీ రాజకీయ పార్టీ నేతా చేసేది అదే. కానీ.. అడ్డుకున్నారు. అయితే.. ఇక్కడ మొదట అడ్డుకుంది పోలీసులు కాదు.. వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలను వెనక్కి పంపడం కన్నా.. చంద్రబాబును వెనక్కి పంపడమే తెలివైన నిర్ణయం అనుకుని.. ఆ పని చేశారు. అప్పట్లో ఎయిర్‌పోర్టులో అడ్డుకున్న పోలీసులపై జగన్ .. తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను సీఎంనని.. మీ సంగతి తేలుస్తానని హెచ్చరించారు. అన్నట్లుగానే ఆయన సీఎం అయ్యాక ఆ పోలీసులకు ఇప్పుడు పోస్టింగులు లేవు.

రేపు అధికారం మారితే ప్రతీకారం తీర్చుకోకపోవడం చేతకాని తనమవుతుందగా..?

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. హిట్లర్ నుంచి ముషారఫ్ వరకు.. కరుణానిధి నుంచి చంద్రబాబు వరకూ.. చరిత్ర చెప్పిన సత్యం ఇది. అధికారం మారిన తర్వాత అలా నియంతల్లా పాలించిన వారు అంతకంతకూ కష్టాలు అనుభవించారు. ఎందుకంటే.. వారు పెట్టిన బాధలు అనుభవించిన వారు.. తమ రోజు వచ్చినప్పుడు.. అంతకంతకూ ప్రతీకారం తీర్చుకోకపోతే.. చేతకాని వాడనే ముద్ర వేసేస్తారు. అందుకే..ఈ సిరీస్ కొనసాగాలి. ఎక్కడ ఆగుతుందో చెప్పడం కష్టమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరంజీవిని కలిసి ఆశీర్వాదం తీసుకున్న సోము వీర్రాజు..!

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా కొత్తగా నియమితులైన సోము వీర్రాజు మొదటగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సాధారణంగా ఆయన...మొదట పవన్ కల్యాణ్‌ని కలుస్తారని భావించారు. అయితే.. పవన్ కల్యాణ్‌తో భేటీ కంటే...

అమరావతి నిధుల లెక్కలన్నీ అడిగిన హైకోర్టు..!

అమరావతిలో గత ప్రభుత్వం పెట్టిన రూ. వేల కోట్ల ప్రజాధనం వృధా పోతుందన్న పిటిషన్‌పై హైకోర్టు విచారమలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమరావతిలో రూ. 52 వేల కోట్ల రూపాయల...

జగన్‌కు గుడి కాదు చర్చి కట్టాలన్న ఆర్ఆర్ఆర్..!

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి జగన్ కు గుడి కట్టడానికి ఏర్పాట్లు చేయడం.. భూమి పూజ చేయడం వివాదాస్పదమవుతోంది. ఖచ్చితంగా అయోధ్య రామాలయానికి శంకుస్థాపన జరుగుతున్నప్పుడే.. తలారి...

మంచు వారి ‘ఓటీటీ’

ప్ర‌తీ సినీ కుటుంబానికీ ఓ నిర్మాణ సంస్థ ఉండ‌డం ఎంత స‌హ‌జంగా మారిందో, ఇప్పుడు ఓ ఓటీటీ సంస్థ ఉండ‌డం కూడా అంతే రివాజుగా మార‌బోతోంది. ఓటీటీ సంస్థ‌ల ప్రాధాన్యం క్ర‌మంగా పెరుగుతోంది....

HOT NEWS

[X] Close
[X] Close