“పంచాయతీ ఎన్నికల”పై స్టేకు హైకోర్టు నిరాకరణ..!

పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిర్ణయంపై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పేసింది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని.. ఎస్‌ఈసీ భావిస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని.. ఎస్‌ఈసీని నిలువరించాలంటూ.. ఏపీ ప్రభుత్వం తరపున పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు..స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణ రేపు కూడా కొనసాగనుంది.

స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయమే ఫైనల్ అని గతంలో సుప్రీంకోర్టుకూడా స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియలో సామాన్యంగా కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఈ విషయం సాధారణ న్యాయ విషయాల్లో అవగాహన ఉన్న వారందరికీ తెలుసు. అయినప్పటికీ ప్రభుత్వం మొండి పట్టుదలగా.. ఎస్‌ఈసీని నియంత్రించాలన్న ఉద్దేశంతో పంచాయతీ ఎన్నికలు సాధ్యం కాదని హైకోర్టులో చెప్పించాలని తాపత్రయ పడింది.ఇప్పుడు.. హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించడంతో ఎస్‌ఈసీ విధి నిర్వహణకు అడ్డు చెప్పడం కోర్టు ధిక్కరణ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

గతంలో ఎస్‌ఈసీకి ఎన్నికల నిర్వహణలో సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ ప్రభుత్వం సహకరించడం లేదు. రెండు సార్లు వీడియో కాన్ఫరెన్స్ వాయిదా వేయించింది. ఓటర్ల జాబితా సిద్ధం చేసే విషయంలోనూ సహకరించడం లేదు. కోర్టుల్లో ప్రయత్నాలు చేసి.. ఆలస్యం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం సానుకూల ఫలితం రాదని తెలిసి కూడా.. హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close