ఏపీ అసెంబ్లీ : రెండో సైడ్ కనిపించకూడదు..! వినిపించకూడదు..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసి సభను నిర్వహించారు. రాష్ట్రంలో అమూల్ మిల్క్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే.. అవకాశం రాకపోవడంతో పోడియంను చుట్టుముట్టారు. చివరికి వారందర్నీ స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతకు ముందు సభలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్న నిమ్మల రామానాయుడు వంటి వారిపై వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. నిమ్మలకు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు రక్షణగా నిలబడాల్సి వచ్చింది. మొదటి రోజు నుంచి ఏదో ఓ సందర్భంలో టీడీపీ సభ్యుల్ని బయటకు పంపుతూనే ఉన్నారు. ఆ తర్వాత చర్చలు.. బిల్లులు పాస్ చేస్తున్నారు.

ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వ తప్పు ఒప్పుల్ని చెప్పే అవకాశాన్ని ఇవ్వడం లేదు. అతి కష్టం మీద ఎవరికైనా అవకాశం ఇస్తే.. మాటి మాటికి కలుగచేసుకోవడానికి వైసీపీ సభ్యులు సిద్ధమవుతున్నారు. స్పీకర్ కూడా.. అధికార పక్షం నుంచి ఎవరు అడిగినా.. ప్రతిపక్షం మాట్లాడుతున్న వారికి బ్రేక్ ఇచ్చి వారికి చాన్సిస్తున్నారు. సాధారణంగా స్పీకర్ స్థానంలో ఉన్న ప్రభుత్వం ప్రకటన చేస్తున్నప్పుడు.. స్పందించడానికి తప్పులు చెప్పడానికి.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు ఎక్కువ చాన్సిస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడుతూంటే.. ఎదురుదాడి చేయడానికి అధికారపక్షానికి అవకాశం ఇస్తున్నారు. దీంతో ప్రతిపక్ష వాయిస్ అసలు బయటకు రావడం లేదు.

శాసనసభ సమావేశాలు చూపించే విషయంలో ప్రతిపక్ష సభ్యులకు చోటు ఉండటం లేదు. తప్పనిసరిగా చూపించాల్సి వచ్చినప్పుడు మాత్రమే టీడీపీ సభ్యులు కనబడుతున్నారు. లేకపోతే వారు సభలో ఉన్నారో లేరో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. కవరేజీకి కూడా.. ప్రభుత్వ వ్యతిరేకం అనుకున్న చానళ్లను రానివ్వడం లేదు. దీంతో అసలు ప్రతిపక్షం గొంతు పూర్తిగా నొక్కేసినట్లయింది. స్పీకర్ కూడా.. విపక్ష సభ్యులతో కలిసిపోయినట్లుగా పట్టుమని పదిహేను మంది లేని విపక్ష సభ్యులపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో విపక్ష సభ్యులు పడిపోతున్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయమంటే.. అప్పుడు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరికి మాట్లాడేందుకు చాన్సివ్వాలనుకున్నా … కింద వైపు నుంచి సూచనలు వస్తేనే… స్పీకర్ చైర్‌లో ఉన్న వారు ఇస్తున్నారు. మొదటి రోజు..చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ మైక్ ఇవ్వడంతో జగన్ ఫైరయ్యారు. ఆ తర్వాత స్పీకర్ చైర్లో కూర్చున్న వారు అసలు ప్రతిపక్షాన్ని పట్టించుకోవడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close