సాంప్రదాయ టెలివిజన్ మాధ్యమాల కంటే డిజిటల్ మాధ్యమాలపై ప్రేక్షకుల ఆసక్తి పెరుగుతోందని చెప్పడానికి 2026 ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల కవరేజ్ ఒక నిదర్శనంగా నిలిచింది. ఎన్నికల ఫలితాల సందర్భంగా యూట్యూబ్ లో జరిగిన వ్యూయర్షిప్ వార్‌లో ఊహించని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ డిజిటల్ నెట్వర్క్ RTV ఇతర ప్రధాన వార్తా సంస్థల కంటే తాము భారీ ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడైంది.
# మే 4 మరియు 5 తేదీల్లో జరిగిన ఎన్నికల ఫలితాల కవరేజ్‌కు సంబంధించి యూట్యూబ్ కాంకరెంట్ వ్యూయర్షిప్ అంటే ఏకకాలంలో వీక్షించిన వారి సంఖ్య వివరాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. RTV అత్యధికంగా 64 మిలియన్లకు పైగా వ్యూయర్షిప్తో అగ్రస్థానంలో నిలిచింది. TV9 నెట్ వర్క్ 11 మిలియన్ల వ్యూయర్స్‌తో రెండో స్థానంలో ఉంది. NTV 1 మిలియన్ వ్యూయర్స్‌ను సాధించింది. ఇతర ఛానళ్లు అయిన ABN, V6, Big TV వరుసగా 421K, 264K మరియు 180K వ్యూయర్షిప్కు పరిమితమయ్యాయి.
సాధారణంగా వార్తా ఛానళ్ల మధ్య ఉండే పోటీ ఈసారి ఏకపక్షంగా సాగినట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. మొదటి స్థానానికి, రెండో స్థానానికి మధ్య ఉన్న వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. రవిప్రకాష్ నేతృత్వంలో డిజిటల్ మీడియా దూసుకెళ్తోంది. ఇది కేవలం పోటీ మాత్రమే కాదు, డిజిటల్ రంగంలో సృష్టించిన పెను సంచలనం అని రవి ప్రకాష్ ప్రకటించుకున్నారు.
ఒకప్పుడు కేవలం టీవీ సెట్లకే పరిమితమైన వార్తలు, ఇప్పుడు స్మార్ట్ఫోన్ల ద్వారా క్షణక్షణం ప్రజలకు చేరువవుతున్నాయి. ప్రధాన మీడియా సంస్థలు ఒకవైపు టీవీ రేటింగ్‌ల కోసం పోటీ పడుతుంటే, డిజిటల్ మీడియా సంస్థలు యూట్యూబ్ మరియు సోషల్ మీడియా వేదికగా తమ సత్తా చాటుతున్నాయి. తాజా ఫలితాల కవరేజ్‌లో RTV సాధించిన ఈ సంఖ్యలు, తెలుగు డిజిటల్ మీడియా రంగంలో వస్తున్న మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి.
