‘సంబరాల ఏటి గట్టు’ సినిమాతో బిజీగా ఉన్నారు సాయిధరమ్ తేజ్. ఆ తరవాత చేయబోయే సినిమా కూడా ఖరారైంది. ‘సేవ్ ద టైగర్స్’ వెబ్ సిరీస్ తో పాపులారిటీ సంపాదించుకొన్న దర్శకుడు తేజ కాకమానుతో ఓ సినిమా ఫిక్స్ చేశారు సాయిధరమ్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి ‘పరు వేట’ అనే వెరైటీ టైటిల్ ఫిక్స్ చేశారు.
పరువేట అనేది అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రతీ ఏటా జరిగే ఉత్సవం.ఈ ఉత్సవానికి విశిష్టమైన చారిత్రక, సాంస్క్రృతిక నేపథ్యం ఉంది. అలాంటి పేరుని ఈ సినిమాకు ఖరారు చేయడం ఆసక్తికలిగిస్తోంది. అటవీ నేపథ్యంలో సాగే కథ ఇది. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్ కూడా చాలా పకడ్బందీగా చేశారు. అక్టోబరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. కథానాయిక కోసం ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది. లిస్టులో టాప్ హీరోయిన్ల పేర్లే ఉన్నాయి. ఇప్పటి వరకూ తేజ్ తో జత కట్టని కథానాయికనే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.


