“తాపీ దాడి” కేసులో కొల్లు రవీంద్రకు నోటీసులు..!

మచిలీపట్నం పోలీసులు తాపీ దాడి కేసును మెల్లగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర వద్దకు తీసుకెళ్తున్నారు. ఆయనకు సెక్షన్ 91 కింద నోటీసులు పంపారు. విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామని చెబుతున్నారు. నాలుగు రోజుల కిందట… పేర్ని నానిపై ఆయన ఇంట్లోనే బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి తాపీతో దాడి చేశాడు. తాను వైసీపీ కార్యకర్తనని… పేర్ని నాని అనుచరుడ్నని.. అయితే ఇసుక కొరత కారణంగా పనుల్లేవని.. ఈ కారణంగానే పేర్ని నానిపై దాడి చేసినట్లుగా నిందితుడు వాంగ్మూలం ఇచ్చారు. అయితే.. అప్పటి నుంచి రాజకీయ కోణం వెదుకుతున్న వైసీపీ నేతలు… హోంమంత్రి కూడా.. టీడీపీ నేతల ప్రమేయం ఉందని చెబుతూ వస్తున్నారు.

మూడు రోజుల నుంచి బడుగు నాగేశ్వరరావు కాల్ లిస్ట్ పరిశీలిస్తూనే ఉన్నారు. చివరికి కొల్లు రవీంద్రకు నోటీసులు జారీ చేశారు. నిజానికి బడుగు నాగేశ్వరరావు పేర్ని నానికి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. తల్లి దశదిన కర్మ రోజు.. పేర్ని నాని వెనుకే ఆయన ఉన్నట్లుగా వైసీపీ సోషల్ మీడియాలోనే ప్రచారం జరుగుతోంది. అన్ని అంశాల్లోనూ ఆయన వెంటే ఉన్నారని… పేర్ని ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొంటారని చెబుతూంటారు. అయితే ఇప్పుడు ఆయన వెనుక టీడీపీ ఉన్నారని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చివరికి కేసులో ఏం తేలినా తేలకపోయినా.. ప్రచారం చేసుకోవడానికి ఈ నోటీసులు ఉపయోగపడతాయన్న అంచనా కూడా ఉంది. కొల్లు రవీంద్ర ఐదేళ్ల పాటు మంత్రిగా ఉన్నారు.

కానీ ఎప్పుడూ విపక్ష నేతలపై కూడాదాడి జరగలేదు. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేర్ని నాని మంత్రి అయ్యాక.. అధికార పార్టీ నేతలపైనే దాడులు జరుగుతున్నాయి. వైసీపీ నేత హత్యకు గురయ్యారు. పేర్ని నానిపైనే దాడి జరిగింది. దీనంతటికి కొల్లు రవీంద్రనే కారణమనన్నట్లుగా ఆయన వైపే కేసుల్ని మళ్లిస్తున్నారన్న ఆరోపణలను టీడీపీ నేతలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close