ఏపీ ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లుగా కేసు నమోదు అయింది. ఆమె ఆస్పత్రిలో చనిపోయిన సమయంలో గదిలో భార్యతో పాటు ఐఏఎస్ అధికారి మాత్రమే ఉన్నారు. అయితే వైద్యులు ఆమె మృతిని సాధారణ మరణంగా భావించలేక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద మెడికో లీగల్ కేసు నమోదు చేశారు.
ఐఏఎస్ అధికారి కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక వయసు 42 ఏళ్లు. గతంలో ఆమెకు కిడ్నీలో రాళ్లు ఉన్న ఆపరేషన్ జరిగింది. తర్వాత గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రి గదిలో సత్యదీపికతో పాటు కిషోర్ కూడా ఉన్నారు. అయితే మధ్యలో నిద్రలేచి చూసినప్పుడు తన భార్య అచేతనంగా ఉన్నారని .. కిషోర్ వైద్యులను పిలిచారు. వైద్యులు వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉన్నారు. గుండెపోటు లక్షణాలేమీ కనిపించలేదని వైద్యులు భావించారు.
మరణం కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మెడికో లీగల్ కేసు నమోదు చేశారు. ఈ అంశంలో కిషోర్ కుమార్.. తాను గదిలోనే ఉన్నానని ఒప్పుకుంటున్నారు. పోలీసులు పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత దాని ప్రకారం దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది.
