…అయినా బాబు ప్రభుత్వానికి బుద్ధి రాలేదు!

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం మీద ఎలాంటి ఆసక్తీ లేదా? కరువు పరిస్ధితులపై కేంద్రం అడిగే వరకూ నివేదిక ఇవ్వలేదంటే ఏమనుకోవాలి?

ఒడిస్సా, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కరువు సాయంకోసం కేంద్రానికి చాలాకాలంక్రితమే నివేదికలు పంపగా కేంద్రం అడిగేవరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరువు సహాయం అడగాలన్న విషయమే మరచిపోయింది.

కరువు వచ్చాక బావి తవ్వుకొనే విధానం వద్దనీ, ప్రభుత్వాలు ముందస్తు సహాయ చర్యలు చేపట్టాలని నిరుడు సుప్రీం కోర్టు మొట్టికాయలేసింది. ఇదే అంశంపై న్యాయస్థానం మందలింపులకు గురైన రాష్ట్రాల్లో ఏపి కూడా ఉంది. అయినా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు.

చాలినంత వర్షం లేదా చాలినన్ని వర్షపురోజులు లేకపోవడమే కరువు పరిస్ధితి. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం అనుమానమేని ఖరీఫ్‌కు ముందే వాతావరణ హెచ్చరికల కేంద్రాలు హెచ్చరించాయి. ఆ ప్రకారమే జూన్‌ నుంచీ ప్రతి నెలలోనూ వర్షాలకు అంతరాయాలు (డ్రైస్పెల్స్‌) ఏర్పడ్డాయి. చాలినన్ని రెయినీ డేస్ లేవు. అనేక మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతూ వచ్చింది. సెప్టెంబర్‌లో అయితే ఏకంగా సాధారణ వర్షంలో లోటు 80 శాతానికి మించి పోయింది. మూడు వారాలకుపైన చినుకు కరువైంది. వ్యవసాయశాఖలో వున్న వివరాల ప్రకారం…మొత్తం 670 మండలాలకు ఇప్పటికే 373 మండలాల్లో కరువు వుంది. రోజు రోజుకూ వర్షాభావం తీవ్రమవుతోంది. శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం… ఈ ఐదు జిల్లాల్లో వానే లేదు. మామూలుగా సాగు చేసే విస్తీర్ణంలో ఐదు లక్షల ఎకరాలు తగ్గింది.

సాగు చేసిన పంటలు చేతికిరాని దుస్థితి. దిగుబడులు భారీగా తగ్గనున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కరువు మాన్యువల్‌ మేరకైతే తక్షణం వర్షాభావ మండలాన్నింటినీ ప్రకటించవచ్చు. ఇక్కడ ప్రభుత్వ వడపోతల వల్ల కరువు వున్నా కరువ ప్రాంతంగా నోటిఫై కాని దుస్ధితి అనేక మండలాలకు విస్తరించింది. ముందటేడు 238, నిరుడు 359 మండలాలకు కరువును తగ్గించేశారు. ఆ మేరకైనా బాధితులను ఆదుకుందా అంటే అదీ లేదు. 2014 ఖరీఫ్‌లో కరువురాగా ఆ మరుసటి ఏడాది ఫిబ్రవరిలో కరువు మండలాల ప్రకటన వెలువడింది. కేంద్ర బృందాలు ఏప్రిల్‌లో పర్యటించాయి. రాష్ట్రం రూ.1,924 కోట్ల సాయం అడిగితే కేంద్రం రూ.237 కోట్లు ఇస్తామనిచెప్పి సర్దుబాట్లతో కలుపుకొని రూ.181 కోట్లిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం 2015 ఖరీఫ్‌ మొదలయ్యాక జూలైలో రైతులకు రూ.692 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ మంజూరు చేసింది. ఎన్ని నిధులు విడుదలయ్యాయో, ఎంత మందికి పంపిణీ జరిగిందో నేటికీ స్పష్టత లేదు. ఉద్యానవన రైతులకు పరిహారం ఇంకా ప్రాసెస్‌లోనే ఉంది. ఇది రెండేళ్లనాటి కరువు బాధితుల గోడు.
నిరుడైతే విడతలవారీగా 359 మండలాలు ప్రకటించగా ఇప్పటి వరకు రైతులకు నయాపైసా పరిహారం ఇవ్వలేదు.

రైతుల పట్ల , బిజెపి, టిడిపి సంకీర్ణ దారుణాలు ఇంకా ఉన్నాయి. రైతులకు 2013 కరువు పరిహారాన్ని బాబు సర్కారు ఎగ్గొట్టింది. అది కాంగ్రెస్ బాధ్యత అని బదులిచ్చారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఖజానాలో కలిపేసి వేరే వ్యాపకాలకు మళ్లించింది.

విశాఖను అతలాకుతలం చేసిన 2014 హుదూద్‌ తుపాను బాధితులకు ప్రధాని మోడీ రూ. వెయ్యి కోట్ల తక్షణ సాయం ప్రకటించగా కూడికలు, తీసివేతలతో ఇప్పటికి అందింది రూ.700 కోట్లు కంటే తక్కువే. ఇదీ ఏపీపై బిజెపికి ఉన్న ప్రేమ, రాష్ట్ర ప్రయోజనాలపై టిడిపికి ఉన్న శ్రద్ధ. రుణమాఫీ వలన విపత్తు మండలాలను ప్రకటించినా రైతులకు రుణాల రీషెడ్యూల్‌, కొత్త అప్పుల మంజూరు వంటి తాత్కాలిక ఉపశమనాల్లేవు. కౌలు రైతుల బాధలు వర్ణనాతీతం.

కరువంటే కేవలం రైతులకే పరిమితం కాదు. వ్యవసాయ కూలీలు, పాడి రైతులు, ఇతర వ్యవసాయ అనుబంధ, గ్రామీణుల ఉపాధిపై తీరని ప్రభావం చూపుతుంది. ప్రజలకు తాగునీరు, పశువులకు గ్రాసం, తాగునీటికి కటకట ఏర్పడుతుంది. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇతర కరువు ప్రాంతాల నుంచి కూలీలు, రైతులు పెద్ద సంఖ్యలో వలసలు పోతున్నారు. ఉపాధి హామీ, ఆహార భద్రతా చట్టాలు పత్తా లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చైనా ప్రొడక్ట్స్ బ్యాన్ చేద్దాం అన్న నాగబాబు, కౌంటర్ ఇచ్చిన నెటిజన్లు

భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు 1960వ దశకం నుండి ఉన్నాయి. అప్పుడప్పుడు హిందీ చీనీ భాయి భాయి అంటూ సత్సంబంధాలు నెరపడం, మళ్ళీ అప్పుడప్పుడు చైనా కయ్యానికి కాలు దువ్వడం దశాబ్దాలుగా జరుగుతోంది....

పరిహారం, పర్యావరణానికి ఎల్జీ పాలిమర్స్ కట్టిన రూ.50 కోట్లు ..!

ఎల్జీ పాలిమర్స్ సంస్థ కలెక్టర్ వద్ద డిపాజిట్ చేసిన యాభై కోట్ల రూపాయలను..పర్యావరణ పునరుద్ధరణ.. బాధితులకు పరిహారం కోసం వినియోగించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ స్పష్టమైన తీర్పును వెల్లడించింది. కేంద్ర పర్యావరణ...

మరో మూడు నెలలు సీఎస్‌గా సహాని..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి మరో మూడు నెలల పొడిగింపు లభించింది. మామూలుగా ఆమెకు జూన్ 30వ తేదీతో రిటైర్ కావాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి...

ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానంటున్న ఆనం..!

ప్రజల కోసం ప్రభుత్వాన్ని... అధికారులను నిలదీయడానికి సిద్దమని ప్రకటించారు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి. అధికారులను సరే కానీ..ప్రభుత్వాన్ని నిలదీస్తామనే మాటే నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అంతటితో వదిలి...

HOT NEWS

[X] Close
[X] Close