జేసీపై కేసు: మీసం మెలేసినందుకూ పెడతారా..!?

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభారక్ రెడ్డిపై మీసం మెలేశారంటూ పోలీసులు కేసులు పెట్టడం సంచలనంగా మారింది. వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ముందూ వెనుకా ఆలోచించకుండా కేసులు పెట్టేశారు. 153A, 506 సెక్షన్ల కింద కేసు పెట్టి.. మీసం మెలేసి..రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. దీనంతటికి కారణం.. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో. ఆ వీడియోలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీసం మెలేస్తే.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని సవాల్ చేస్తున్నట్లుగా ఉంది. దాన్ని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు విస్తృతంగా సర్క్యూలేట్ చేశారు. ఇది వైసీపీ నేతలకు కోపం తెప్పించింది. దాంతో వైరు జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.

మున్సిపాల్టీల్లో రెండో వైస్ చైర్మన్‌ని ఎన్నుకునేలా ప్రభుత్వం చట్టాన్ని మార్చింది. దీని ప్రకారం… రెండో మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠం కోసం ఎన్నికలు జరిగాయి. తాడిపత్రిలో టీడీపీకి మెజార్టీ ఉండటంతో… వైసీపీ సభ్యలు దీనికి గైర్హాజర్ అయ్యారు. టీడీపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఈ సందర్భంలోనే ఆ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయాలని.. మళ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని… సవాల్ చేశారు. దానికి ప్రభాకర్ రెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే కూడా రాజీనామా చేస్తే… ఎన్నికలకు వెళదామని సవాల్ చేశారు. ఈ సవాళ్లు.. ప్రతి సవాళ్లు అలా కొనసాగుతూండగానే వ్వవహారం కేసుల వరకూ వెళ్లింది.

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జేసీ కుటుంబం తీవ్రఒత్తిడికి గురవుతోంది. అనేక కేసులను వారు ఎదుర్కొంటున్నారు. బస్సుల బిజినెస్.. మైనింగ్ వ్యాపారం ఇలా అనేకం… మూతబడిపోయాయి. అయినా జేసీ బ్రదర్స్ ఎక్కడా తగ్గడం లేదు. ప్రభుత్వంపై పోరాటంలో ఎక్కడా వెనుకడుగు వేయడం లేదు. తాడిపత్రిలో మెత్తగా ఉంటే… రాజకీయం నడవదని దూకుజుగా ఉండాలని… వారు ఆ తరహా రాజకీయం చేస్తున్నారు. కేసులు పెట్టినా తగ్గడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేటీఆర్‌పై డ్రగ్స్ ఆరోపణలు చేయవద్దని రేవంత్‌కు కోర్టు ఆదేశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో షాక్ తగిలింది. తెలంగాణ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్‌ను వారించిన కోర్టు ఇక పై ఈడీ...

షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు – డబ్బులివ్వలేదని కూలీల ఆందోళన

నిరుద్యోగ ఉద్యమంలో భాగంగా ప్రతి మంగళవారం చేస్తున్న దీక్షను ఈ వారం హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ లో చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు షర్మిల అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతించలేదు. ఆమె...

అచ్చెన్న, నిమ్మలకు అసెంబ్లీలో మైక్ ఇవ్వరట !

అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించే ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ ఇవ్వకూడదని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సిఫార్సు చేసింది. త్వరలో అసెంబ్లీ వర్షాకాల...

‘లూసీఫ‌ర్‌’కి మ‌ళ్లీ రిపేర్లు

మ‌ల‌యాళ `లూసీఫ‌ర్‌`ని తెలుగులో `గాడ్ ఫాద‌ర్‌`గా రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి క‌థానాయ‌కుడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొద‌లైంది. అయితే.. మ‌ళ్లీ బ్రేక్ వ‌చ్చి ప‌డింది....

HOT NEWS

[X] Close
[X] Close