ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో విచారణను చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. పాత్రధారుల నుంచి సూత్రధారుల వైపు వెళ్తోంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ స్కాం అమలు చేసిన వారిలో కీలక వ్యక్తి. అయితే మొదటి నుంచి కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ అటు విచారణకు రాకుండా.. ఇటు అరెస్టు కాకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేస్తారని క్లారిటీ రావడంతో తీర్పు వచ్చే సమయానికి ఆయన కనిపింకుండా పోయారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన తర్వాత మిథున్ రెడ్డి కోసం పోలీసులు వెదికితే ఆచూకీ తెలియలేదు.
స్కాం చేసి ఎన్నాళ్లు తప్పించుకోగలరు ?
అరెస్టు నుంచి తప్పించుకోవడానికి మిథున్ రెడ్డి అవినాష్ రెడ్డి తరహాలో ప్లాన్లు వేసుకుంటున్నారు. కోర్టుల్లో పిటిషన్లు వేసి విచారణలు జరిగేంత వరకూ రక్షణ తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఈ సమయంలో కనిపించకుండా పోతున్నారు. అరెస్టు నుంచి తప్పించుకుంటున్నారు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్.. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయి.. మళ్లీ హైకోర్టుకు వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లేంత వరకూ ఆజ్ఞాతంలోకి పోయే అవకాశం ఉంది. కానీ సీఐడీ సిట్ అధికారులు ఈ సారి చాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఏ క్షణమైనా అరెస్ట్
ఆయన విదేశాలకు పారిపోతే .. మళ్లీ రావడం కష్టం. ఒక వేళ అలా రాకపోతే ఎంపీగా ఉండి పరారీ అయిన వ్యక్తిగా మారుతాడు. అందుకే ఆయన పారిపోడని అనుకుంటున్నారు. న్యాయపరమైన రక్షణ లభించకపోతే సిట్ అధికారుల ఎదుట లొంగిపోవడం మినహా మరో దారి లేదు. అలా అయితే అరెస్టు అవుతాడు. ఎన్ని రోజులు జైల్లో ఉండాల్సి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో స్పష్టమైన సాక్ష్యాలను సిట్ సేకరించింది. వాటిని నిందితులు దాఖలు చేస్తున్న పిటిషన్ల విచారణ సమయంలో కోర్టు ముందు ఉంచుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. హైకోర్టు కూడా అదే అభిప్రాయంతో ఉంది.
అంతిమ లబ్దిదారుడు కూడా దొరికినట్లే !
మిథున్ రెడ్డి ప్రతి శనివారం మద్యం స్కాం లెక్కలను చెప్పేందుకు జగన్ రెడ్డిని కలిసేవారని.. వైసీపీలో ..తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఉండే వారందరికీ తెలుసు. మనీ ఎలా రూటింగ్ జరిగిందో.. ఎలా చేశారో అంతా మిథున్‌రెడ్డికి తెలుసు. అంతే కాదు.. కొనుగోలు చేసిన వందల కిలోల బంగారం గుట్టు కూడా బయటపడాల్సి ఉంది. మిథున్ రెడ్డిని అరెస్టు చేసి ప్రశ్నిస్తే కథ కంచికి చేరడానికి మార్గం సుగమం అవుతుందని అనుకోవచ్చు.