ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి పదవికి చివరి రోజులు వచ్చేశాయి. 2019లో జగన్ సీఎం అవగానే.. పదవి కొట్టేసిన ఆయన ఇప్పటి వరకూ కొనసాగారు. ఈ సారి మాత్రం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23వ తేదిన ఏపి సచ్చివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగుతాయి. ఈ నెల 29 తో ప్రస్తుత అప్స అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. సచివాలయం, అసెంబ్లీ తో కలిపి ఓటుహక్కు వినియోగించుకోనున్న మొత్తంఓటర్లు 1200 మంది ఉన్నారు.
ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజల పన్నుల నుంచి జీతం తీసుకుంటూ ప్రజల కోసం పని చేయాల్సిన వెంకట్రామిరెడ్డి…వైసీపీ కోసం పని చేయడం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నాయి. ఆయన ఉద్యోగ విధులు వెలగబెట్టింది లేదు..కానీ రాజకీయాలతో ఆయన చేయకూడని పనులన్నీ చేస్తున్నారు. వైసీపీ హయాంలో.. న్యాయవ్యవస్థపైనే నిందలు వేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై అనుచితంగా మాట్లాడారు.. వారి ఆదేశాలను ఉల్లంఘించారు. ప్రభుత్వం మారక ముందే ..వైసీపీ ప్రచారంలో పాల్గొని సస్పెన్షన్ కు గురయ్యాడు. ఇప్పటి వరకూ సర్వీస్ లోకి రాలేదు.
ఆయనపై చాలా అభియోగాలు ఉన్నాయి. గతంలో ప్రభుత్వ సమాచారం దొంగిలించి వైసీపీకి పంపించారన్న కేసులు కూడా ఉన్నాయి. వైసీపీకి ప్రచారం చేస్తూ.. దొరికిపోవడంతో ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆయన ఇలా చేసినందుకు ఈ సంఘాన్ని ప్రభుత్వం రద్దు చేయాలనుకుంది. కానీ ఆయన తప్పు చేస్తే ఆయనను శిక్షించాలి కానీ సంఘాన్ని వద్దని ఉద్యోగులు వేడుకోవడంతో ఆగిపోయారు. ఈ సారి ఆయన గెలిచే అవకాశాల్లేవు. ఉద్యోగ సంఘం పదవిపోయాక.. ఉద్యోగం నుంచి కూడా ఆయనను సాగనంపే అవకాశాలు ఉన్నాయి.
