అపెక్స్ వాయిదా.. సుప్రీంకు తెలంగాణ..!

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడిదింది. ఇరవయ్యో తేదీ తర్వాతే సమావేశం పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కోరారు., పైగా ఈ రోజు కేబినెట్ భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు సీఎంలు హాజరైతేనే అపెక్స్ భేటీ అయినట్లు. కేసీఆర్ నిరాసక్తత కారణంగా ఈ భేటీ వాయిదా పడింది. అయితే… కేసీఆర్‌కు… కృష్ణా జలాలను కాపాడే అంశంపై ఆసక్తి లేదని అందుకే.. అపెక్స్ భేటీకి హాజరవకుండా… రాయలసీమ ఎత్తిపోతల టెండర్లకు సహకరిస్తున్నారని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి కౌంటర్‌గా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు తీసుకోకుండా… కట్టాలనుకుంటున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు రద్దు చేయాలని… తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే.. ఈ టెండర్లు నిలిపివేయాలని కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఏపీ సర్కార్‌ను ఆదేశించింది. అయితే.. కృష్ణాబోర్డు ఆదేశాలను పట్టించుకోవాలని ఏపీ అనుకోవడం లేదు. శ్రీశైలం నుంచి నీటిని నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ తరలిస్తున్నా.. తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. ఏపీ ఆగ్రహంతో ఉంది. అలాంటప్పుడు.. తాము టెండర్లను ఎందుకు నిలిపివేయాలనుకుంటోంది. ఈ కారణంగా తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది.

ఎలక్ట్రానిక్ పద్దతిలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఈ పిటిషన్ దాఖలు చేసింది. విచారణకు ఎప్పుడు వస్తుందనేది.. త్వరలో తెలియనుంది. ఇప్పటికి రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లు పనులు.. ప్రాసెస్‌లో ఉన్నాయి. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా పందొమ్మిదో తేదీన టెండర్లను ఖరారు చేయనున్నారు. టెండర్లను ఖరారు చేసుకోవచ్చు కానీ… నిర్మాణాలు ప్రారంభించవద్దని ఎన్జీటీ ఇప్పటికే స్పష్టం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close