టాలీవుడ్ ని క‌మ్మేస్తున్న క‌రోనా

టాలీవుడ్ ని క‌రోనా క‌మ్మేస్తోంది. సినీ స్టార్లు వ‌రుస‌గా కొవిడ్ బారీన ప‌డుతుండ‌డం.. టాలీవుడ్ ని క‌ల‌చివేస్తోంది. బండ్ల గ‌ణేష్ క‌రోనా బారీన ప‌డి కోలుకున్నారు. ఆ త‌ర‌వాత‌.. రాజ‌మౌళి, ఇత‌ర కుటుంబ స‌భ్యులు క‌రోనాకి గుర‌య్యారు. నిన్న‌టికి నిన్న హాస్య న‌టుడు ఫృథ్వీరాజ్ కీ క‌రోనా అని తేలింది. ఇప్పుడు దిగ్గ‌జ గాయ‌కుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకీ క‌రోనా పాజిటీవ్ అని తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న సోష‌ల్ మీడియాలో ధృవీక‌రించారు. “క‌రోనా ల‌క్ష‌ణాలు అతి స్ప‌ల్పంగా ఉన్నాయి. అందుకే ఆసుప‌త్రిలో చేరాను. భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. నేను బాగానే ఉన్నా. త్వ‌ర‌లోనే కోలుకుంటా“ అని అభిమానుల‌కు సందేశాన్ని పంపారు బాలు. నిన్న‌నే ఆసుప‌త్రిలో చేరిన ఫృథ్వీ ప‌రిస్థితి ఈరోజు కొంచెం మెరుగ‌య్యింది. “నేను ఫైట‌ర్‌ని. క‌రోనాతో పోరాడుతున్నా. నిన్న‌టి కంటే నా ఆరోగ్యం వేయి రెట్లు మెరుగ‌య్యింది. త్వ‌ర‌లోనే కోలుకుని బ‌య‌ట‌కు వ‌స్తా“ అని తాజాగా మ‌రో వీడియోని విడుద‌ల చేశారు ఫృథ్వీరాజ్‌. పాప్ గాయ‌ని స్మిత కూడా క‌రోనా బారీన ప‌డింది. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్లో ధృవీక‌రించారు స్మిత‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అన్‌లాక్ 5.0 : ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లకు గ్రీన్ సిగ్నల్..!

ఎట్టకేలకు..దాదాపుగా ఆరు నెలల గ్యాప్ తర్వాత సినిమా ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్‌ 5.0లో భాగంగా..అక్టోబర్ పదిహేనో తేదీ నుంచి ధియేటర్లు, మల్టిప్లెక్స్‌లు ప్రారంభించుకోవచ్చు. కోవిడ్ నిబంధనలు...

మద్యం అక్రమ రవాణాలో దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు..!

ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ మద్యం రవాణాను రాజకీయ పార్టీల నేతలు సైడ్ బిజినెస్‌గా చేసుకున్నారు. గతంలో మచిలీపట్నం పార్లమెంట్‌కు పోటీ చేసిన బీజేపీ నేత రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడగా ఈ సారి వైసీపీ నేత...

రైతుల మోటార్లకు మీటర్లు బిగిస్తే చేతులు మిగలవు : సీపీఐ నారాయణ

కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో బలపడటానికి అగ్రెసివ్ మార్గాన్ని ఎంచుకుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న వ్యవసాయ బోర్లకు విద్యుత్ మీటర్ల బిగింపు నిర్ణయంపై దూకుడుగా వెళ్లి రైతాంగంలో మద్దతు పెంచుకుని ఓటు బ్యాంక్‌ను ప్రభావవంతంగా...

ప‌వ‌న్ సినిమా… మిర‌ప‌కాయ్ – 2?

హ‌రీష్ శంక‌ర్ ని ద‌ర్శ‌కుడిగా నిల‌బెట్టిన సినిమా `మిర‌ప‌కాయ్`. నిజానికి ఈ సినిమాని ప‌వ‌న్ క‌ల్యాణ్ తో తీయాల‌నుకున్నాడు హ‌రీష్‌. కానీ కుద‌ర్లేదు. అది గుర్తుపెట్టుకునే హ‌రీష్ శంక‌ర్‌ని పిలిచి `గ‌బ్బ‌ర్ సింగ్‌`...

HOT NEWS

[X] Close
[X] Close