కుప్పంలో కోటి రూపాయలు వ్యయంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసాము – ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు.
ఈ కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు APTS కార్పొరేషన్ ఆర్ధిక సహకారం అందించింది…
కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ని ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారు. KADA సహకారంతో కుప్పం లో APTS ఇంత మంచి కార్యక్రమం చెయ్యటం సంతోషం – మన్నవ మోహనకృష్ణ గారు
కుప్పం మున్సిపాలిటీలోని స్వర్ణ నవదిశ సెంటర్లో కోటి రూపాయల వ్యయంతో రెండు అంతస్తుల లో అన్ని రకాల టెక్నాలజీ వసతులతో రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ని ఏర్పాటు చేశారు. ఈ కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ని కుప్పంలో ఏర్పాటు చేయటానికి KADA (కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్పొరేషన్ (APTS) నిధులు అందజేసింది. ఈ సెంటర్ వల్ల విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు, చిన్న వ్యాపారవేత్తలు మరియు ఫ్రీలాన్సర్లు లబ్ధి పొందుతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి, పేద కుటుంబాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. యువతకు, కొత్తగా స్టార్టప్‌లు పెట్టే వారికి తక్కువ ఖర్చుతో ఆఫీసు వాతావరణం కల్పించడం, డిజిటల్ చదువులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. కుప్పంలో ఇంత మంచి కార్యక్రమానికి ఆర్ధిక సహకారం అందించటం ఎంతో సంతోషంగా ఉందని మన్నవ మోహన కృష్ణ గారు పేర్గోన్నారు. యువతకు ఉపయోగపడే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పాటును అందించిన APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ గారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అభినందించారు.




















