విజయ రామరాజు టైటిల్ రోల్లో నటించిన బ్లాక్ బస్టర్ స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీని గుబ్బల నిర్మించారు.
46 ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం ఆగస్టు 29న విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి విశేషమైన ప్రశంసలు అందుకున్న ఈ సినిమా నేటి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో భావోద్వేగాలు, లవ్ స్టొరీ ఎలిమెంట్స్ తో ఈ చిత్రం మొత్తం కుటుంబం కలిసి ఎంజాయ్ చేసేలా వుంటుంది. ఈ వీకెండ్లో యూత్, ఫ్యామిలీ, అందరూ కలసి చూడటానికి ‘అర్జున్ చక్రవర్తి’ పర్ఫెక్ట్ ఛాయిస్.
