కేజ్రీవాల్ అంతే, ఆయన మారడు

ఉత్తమ రాజకీయాలతో దేశాన్ని ప్రగతిపథంలో నడిపించవచ్చని నమ్మిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరో కొద్దిరోజుల్లో మూడేళ్లు పూర్తిచేసుకోబోతున్నది. నవంబర్ 26 (గురువారం)తో ఆప్ కి మూడేళ్లు పూర్తయి, నాలుగవఏట అడుగుపెట్టబోతున్నది. ఈ మూడేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆప్ సాధించిన విజయాలను తక్కువగా అంచనావేయలేం. దేశరాజధాని ఢిల్లీలోనే తిష్టవేసుకుని కూర్చున్న పార్టీని తేలిగ్గా అంతకన్నా చూడలేం. ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించడం తేలికకావచ్చేమోకానీ, ఆ పార్టీ ఆశయాలను మరీ ముఖ్యంగా దాని వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్ ఆలోచనలను అందిపుచ్చుకుని సుదీర్ఘకాలం మందుకుసాగడమన్నది చాలాకష్టమని ఇతర రాజకీయపార్టీలో ఈపాటికే గ్రహించాయి. ఆప్ సిద్ధాంతాలను అనుసరించడం మొదలుపెడితే తమ పార్టీలకు మనుగడే ఉండదన్నది ఆయాపార్టీల కచ్చితాభిప్రాయం. పైగా అవి ఆమ్ ఆద్మీ పార్టీపై బురదజల్లుతున్నాయి. తప్పులువెతికిపట్టుకునే పనిలో పడ్డాయి. ఆప్ భిన్నమైనదేమీకాదనీ, అతీతమైనది అంతకంటే కాదనీ, అది కూడా తమ తానులోని ముక్కేనని నిరూపించడం కోసం కాచుకుని కూర్చున్నాయి. అందుకే గడచిన మూడేళ్లుగా `ఆప్’ చేసే ప్రతిపనిని నిశితంగా గమనిస్తున్నాయి.

దేశంలోనే విలక్షణ రాజకీయనాయకుడైన కేజ్రీవాల్ అంతరంగం బయటపార్టీలవారికేకాదు, తన సొంతపార్టీలోని వారికే అర్థంకావడంలేదు. భావజాలస్వారూప్యమున్నప్పటికీ, కేజ్రీవాల్ ఎత్తుగడలను ఆపార్టీలోని సీనియర్లు అర్థంచేసుకోలేకపోతున్నారు. దీంతో వారికి తమ నాయకుడు కొరుకునపడటంలేదు. అందుకే ఒక్కోసారి తమ నాయకుడు నియంతేమోననిపిస్తుంటుంది. ఈ అభిప్రాయమే అప్పుడప్పుడు అంతఃకలహాలు సృష్టిస్తుంటుంది. అలిగి కొంతమంది బయటకువెళ్ళినా ఈ విలక్షణ నేతమాత్రం మారడు. (మారితే విలక్షణ నాయకుడు ఎలా అవుతాడు?) కనుక ఆయన అలాగే కొనసాగుతాడు.

నాలుగోఏట అడుగుపెడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ముందు ఎలాంటి రాజకీయ వ్యూహాలను అనుసరించబోతుందో చూద్దామని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపీ, ప్రతిపక్షమైన కాంగ్రెస్ సహా అనేక పార్టీలు కాచుకుని కూర్చున్నాయి. 2014నాటి సార్వత్రిక ఎన్నికల్లో భారీగా అభ్యర్థులను దింపి చేతులుకాల్చుకున్న `ఆప్’ 2019లో మరోసారి అలాంటి సాహసం చేయదనే అనుకోవాలి. ఎందుకంటే అప్పటికీ, ఇప్పటికీ ఆ పార్టీ వైఖరిలో పెద్దగా మార్పుకనబడటంలేదు. (`పార్టీలో అనేకంటే’, కేజ్రీవాల్ లో అంటే బాగుంటుందేమో…) అర్బన్ ఓటర్లను ఆకర్షించినంతమాత్రాన ఎన్నికల్లో గెలవలేమన్న సంగతి కేజ్రీవాల్ కి బాగానే తెలిసొచ్చింది. పైగా కులరాజకీయ వ్యూహాలను తిప్పికొట్టే శక్తి పార్టీకి లేదని తేలిపోయింది. ఈ కారణాలవల్లనే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ బరిలోనే ఉండదంటున్నారు కేజ్రీవాల్. ఈ ప్రకటన పార్టీలోని చాలామందికి నచ్చకపోయినా ఆయన మారరు.

పవర్ పాలిటిక్స్ అన్నది కేజ్రీవాల్ కు నచ్చదు. అందుకే ఆయన 2013లో ఢిల్లీలో హంగ్ గవర్నమెంట్ ఏర్పాటుచేసినప్పటికీ కేవలం 49 రోజుల్లో తృణప్రాయంగా వదిలేశారు. తర్వాత మళ్ళీ 2015 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినప్పుడు తన పార్టీకి అఖండవిజయాన్ని ( 70 సీట్లలో 67 సీట్లు) దేశరాజకీయాల్లో నూతన చరిత్ర సృష్టించారు. ఢిల్లీ ప్రజలు పార్లమెంట్ నీ, అసెంబ్లీని వేరువేరుగా చూడటం ఇక్కడ గమనించాల్సిన విషయం.

ఈ పరిస్థితిని బాగానే ఆకళింపుచేసుకున్న కేజ్రీవాల్ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తన పార్టీని దూరంగానే ఉంచాలనుకుంటున్నారు. అంతేకాదు, ఢిల్లీ దెబ్బతో హంగ్ వల్ల ఉపయోగం ఉండదని తేలిపోయింది. 2013 ఎన్నికల్లో
70సీట్లకు గాను ఆప్ 28 సీట్లలో మాత్రమే గెలుపొందింది. అదే ఎన్నికల్లో బిజెపీ 31 స్థానాల్లో మెదటిస్థానంలో ఉంది. అయితే ఏపార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునే పరిస్థితిలేకపోవడంతో ఆప్- కాంగ్రెస్ కలసి హంగ్ ప్రభుత్వం ఏర్పాటుచేశారు. అయితే, `జన్ లోక్ పాల్’ బిల్లును నెగ్గించుకోలేని పరిస్థితుల్లో కేజ్రీవాల్ ప్రభుత్వం 49 రోజుల్లోనే అంతమైంది. హంగ్ ప్రభుత్వాలు తన ఆశయాలకు అడ్డంతగులుతున్నాయని ఆనాడే కేజ్రీవాల్ గుర్తించారు. ఢిల్లీ తర్వాత `ఆప్’ పంజాబ్ లో బలం పుంజుకుంటున్నది. 2017లో పంజాబ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ స్థానాలను గెలుచుకోలేకపోవచ్చు, కానీ అక్కడ హంగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకునే విషయంలో ఆప్ కీలకపాత్రధారిగా మారేఅవకాశాలున్నాయి. అయితే కేజ్రీవాల్ కు ఇదంతా ఇష్టంలేదు. పంజాబ్ లో ఒకవేళ అలాంటి అవకాశం వచ్చినా హంగ్ కోసం పరుగులుపెట్టకూడదనే అనుకుంటున్నారు.

ఢిల్లీలో ఆప్ రెండోసారి గద్దెనెక్కి కూర్చున్నప్పటికీ, దేశమంతటా పాలించాలన్న ఆలోచన కేజ్రీవాల్ కు లేదు. 2014లో చేసిన ప్రయోగం వికటించడంతో 2019 ఎన్నికల్లో అదే తప్పు చేయబోవడంలేదు. దేశరాజకీయాల్లో తమ పార్టీని విభిన్నంగానే ఉంచాలన్నది కేజ్రీవాల్ తపన. కులరాజకీయాల ఊబిలో ఆప్ కూరుకుపోకూడదన్నదే ఆయన ఉద్దేశంలాఉంది. అవినీతిని అందమొందించడం, జనపాల్ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావడమే ఢిల్లీలో ఆప్ ముందున్న ప్రధాన సవాళ్లు. అవినీతి విషయానికొస్తే, తన మంత్రిమండలిలోని ఒకర్ని బహిష్కరించేంత కఠినంగా తన పాలన ఉందని కేజ్రీవాల్ గర్వంగా చెప్పుకుంటున్నారు. కేజ్రీవాల్ ఆలోచనలు మంచివే అయినప్పటికీ, వాటిని పార్టీలోని మగతావాళ్లు జీర్ణించుకోవడానికి చాలాసమయమే పడుతోంది. ఈలోగా తమ నాయకుడిలో నియంతపోకడలు కనిపించడం, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించదని అనిపించడం సహజమైపోయింది. ఈ కారణంగా యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ వంటివాళ్లు పార్టీకి దూరమయ్యారు.

కేజ్రీవాల్ తాను అనుకున్న సిద్ధాంతపు బాటను వీడరు. ఆయన దారికి వచ్చినవారిని కలుపుకుంటూ పార్టీని ముందుకుతీసుకువెళుతుంటారు. నచ్చనివారు విమర్శించి వెళ్ళిపోతున్నా పట్టించుకోని ఓ వింత స్వభావం ఆయనది. మరి ఆమ్ ఆద్మీ పార్టీకి మూడేళ్లు నిండి, నాలుగవఏట అడుగుపెడుతున్న సమయంలో కేజ్రీవాల్ ఎలాంటి కీలక ప్రకటనలు చేయబోతున్నారో చూద్దాం.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close