తెలంగాణ నుంచి వెళ్ళి ISISలో చేరి ప్రాణాలు కోల్పోయిన అతీఫ్

మతబోధనలకు ఆకర్షితుడై సొంతభూమిని వదిలిపెట్టి ఐఎస్ఐఎస్ లో చేరిన తెలంగాణ ముస్లీం కుర్రాడు అతిఫ్ వసీమ్ మహ్మద్ పరిస్థితి చివరకు ఏమైంది? ఇంటర్నెట్ ద్వారా ఆకర్షణీయంగా విన్న కబుర్లు, అందుకున్న హామీలు, ఇస్తామన్నా ప్యాకేజీలు చివరకు ఈ ముస్లీం కుర్రాడి ప్రాణాలను కాపాడలేకపోయాయి. క్షణికావేశంలో ఉగ్రవాద సంస్థలో చేరిపోయి, కసితో ఏదేదో సాదిద్ధామనుకుని, ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థల్లో చాలామందే చేరుతున్నారు. ఇండియానుంచి ఇప్పటివరకు 23మంది ISISలో చేరినట్లు దేశీయ, విదేశీయ నిఘా వర్గాలు అందిస్తున్న నివేదికలద్వారా తెలుస్తోంది. ఇలా వెళ్ళినవారిలో ఆరుగురు ఆత్మాహుతిదళ సభ్యులుగా పోరాటంచేసి ప్రాణాలుకోల్పోయారు. వీరిలో తెలంగాణాలోని అదిలాబాద్ కు చెందిన అతిఫ్ వసీం మొహమ్మద్ తో పాటుగా కర్నాటకకు చెందిన మొహమ్మద్ ఉమర్ సుభాన్, మౌలానా అబ్దుల్ కదిర్ సుల్తాన్ అర్మర్, ఫయిజ్ మసూద్, మహారాష్ట్రకు చెందిన సహీమ్ ఫరూఖ్ తన్ఖీ, ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ సజిద్ లు హ్యూమన్ బాంబ్స్ గా మారి ప్రాణాలుపోగొట్టుకున్నట్లు నిఘావర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇండియా నుంచి వెళితే అవమానాలే…

మనదేశం నుంచి వెళ్ళి ఈ ఉగ్రవాద సంస్థలో చేరినవారిని ISIS చిన్నచూపుచూస్తోంది.ఇలాంటి వారిని నాసిరకం పోరాటవాదులుగానే ముద్రవేస్తున్నది. దక్షిణాసియా (ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్) ఇంకా నైజీరియా, సుదాన్ వంటి దేశాల నుంచి వెళ్ళే ఇలాంటి వాళ్లను ISIS ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామంటూ రప్పించుకుని చివరకు పోరాటం చేసే దమ్ములేనివారి జాబితాలో చేర్చేస్తున్నది. ఈ కారణంగానే వారిని ఆత్మాహుతిదళ సభ్యులుగా మార్చేస్తోంది. అరబ్ ఫైటర్స్ ని ఆఫీసర్ క్యాడర్లలో తీసుకుంటూ వారికి మంచి ఆయుదాలు, యుద్ధసామాగ్రి, వసతి సౌకర్యం, జీతం ఇస్తుంటే, దక్షిణాసియా నుంచి వెళ్ళి ISISలో చేరినవారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నదని నిఘాసంస్థలు గుర్తించాయి. దక్షిణాసియా నుంచి వెళ్ళినవారి వసతి మరీ అధ్వాన్నంగానే ఉంటున్నదట. ఇరుకుగదుల్లో చిన్నచిన్న బారక్స్ ఏర్పాటుచేసి వాటిల్లో పడుకోమంటున్నారు. అంతేకాదు, అరబ్ ఫైటర్స్ తో పోలిస్తే వీరికి ఇచ్చేది నామమాత్రపు జీతమే. ఇక మిగతా సౌకర్యాల గురించి చెప్పేపనేలేదు.

నాసిరకం పోరాటగాళ్లని ముద్రపడిన తర్వాత వారిని కారు ప్రేలుడు వంటి సంఘటనలప్పుడు ఉపయోగించుకుంటారు. ఇందుకు చాలా తెలివిగా వ్యూహం పన్నుతారు. కారులో వారిని ఫలానా ప్రాంతానికి వెళ్లమని చెబుతారు. అలా వెళ్ళగానే ఒక నెంబర్ కి కాల్ చేయమని చెబుతారు. కానీ, ఆ నెంబర్ నొక్కగానే పెద్దపేలుడు సంభవించి ఆ ప్రాంతమంతా ధ్వంసమైపోతుంది. ఎన్నో ఆశలుపెట్టుకుని మాత్రుభూమిని వదిలివచ్చి ISISలో చేరినందుకు ఆత్మాహుతిదళ సభ్యులు అలా ప్రాణాలు కోల్పోతుంటారు.

ఎక్కడైనా బాహాబాహీ పోరాటం చేయాల్సివచ్చినప్పుడు దక్షిణాసియా, ఆఫ్రికాల నుంచి వచ్చిచేరిన ఉగ్రవాదులనే ముందువరసల్లో పంపిస్తుంటారు. దీంతో సహజంగానే వారిలోనే ఎక్కువమంది మృత్యువాతపడుతుంటారు. బాగా అనుభవం ఉన్నదన్న ముద్రపడిన అరబ్ టెర్రరిస్టులు వెనుకవరుసలో ఉంటారు. దీంతో మృత్యువాత పడే అరబ్ టెర్రరిస్టుల సంఖ్య కూడా సహజంగానే తక్కువగానే ఉంటుంది.

ISIS పోలీస్ నీడలో…

చైనా, భారత్, నైజీరియా, పాకిస్తాన్ సంతతికి చెందిన వారిని ఒకేచోట ఉండమని చెప్పి వారిపై ISIS పోలీసులతో నిరంతర నిఘా ఉంచుతారు. ISIS పోలీస్ విభాగంలో కొన్నిదేశాలవారు చేరే పరిస్థితే ఉండదు. అలాంటి పోస్టులన్నీ ట్యూనీషియా,పాలిస్థాన్, సౌదీ అరేబియా, ఇరాక్, సిరియా వంటిదేశస్థులకే పరిమతమైఉంటాయి. అరబ్ ఫైటర్స్ కీ, ఇతరదేశస్థులైన ఫైటర్స్ కీ మధ్య ఈ అంతరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఇంటర్నెట్ లో చూసిన రంగుల ప్రపంచానికి ముగ్ధులై అనేక దేశాల నుంచి వెళ్ళి ఐఎస్ఐఎస్ ఊబిలో కూరుకుపోతున్నారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాక్ చేరగానే ఈ బలహీన ఫైటర్స్ కు చెందిన పాస్ పోర్ట్ లను కాల్చేస్తారు. దీంతో వాళ్లు వెనక్కి వచ్చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. అంతేకాదు, మతం పేరిట వారిని బ్రెయిన్ వాష్ చేస్తారు. వెనక్కి వెళ్ళే దారిలేక చివరకు ఇలాంటి వారు ప్రాణాలు కోల్పోతున్నారని దేశీయ, విదేశీయ నిఘా సంస్థలు చెబుతున్నాయి.

(వివిధ మీడియా రిపోర్ట్ ల ఆధారంగా)

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close