ఏపికి హోదా, రైల్వే జోన్ అందుకే ఇవ్వలేకపోతున్నారుట!

ఇదివరకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి ఏపికి ప్రత్యేక హోదా గురించి ఎక్కువగా మాట్లాడేవారు. కారణాలు ఏవయితేనేమి, కేంద్రప్రభుత్వానికి ఆ హామీని అమలుచేసే ఉద్దేశ్యం లేదని స్పష్టం అయిన తరువాత ఇక దాని గురించి వారు మాట్లాడటం మానేశారు. కానీ దాని గురించి మాట్లాడినందుకు ఇద్దరూ ప్రజలు, ప్రతిపక్షాల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలు కూడా ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ ఏర్పాటు వంటి హామీలపై పూర్తిగా ఆశలు వదులుకొన్నట్లే ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రశాంతంగా రోజులు దొర్లించేస్తోంది. ఇటువంటి సమయంలో కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు మళ్ళీ నిన్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు గురించి మాట్లాడి విమర్శలకు ఆస్కారం కల్పించుకొన్నారు.

ఆయన నిన్న శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజక వర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడ్డుపడుతున్నారని తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ఏర్పాటు అంశాలని విభజన చట్టంలో చేర్చాకపోవడం వలననే వాటిని అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపి రాష్ట్ర ప్రభుత్వం మంచి సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను చక్కగా పరిష్కరిస్తున్నాయని చెప్పారు.

ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో చేర్చకపోవడం, ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు ఆయన చెప్పిన రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతీ అందరికీ తెలిసిందే. కనుక ఆ విషయం గురించి మళ్ళీ ఆయన చెప్పడం వలన ఎటువంటి ప్రయోజనం లేదు తమ వైఫల్యాన్ని ఇతరుల మీద రుద్దడం తప్ప. రైల్వే జోన్ ఏర్పాటు చేసే అంశం కూడా విభజన చట్టంలో చేర్చలేదని ఆయన చెప్పడం దేనికంటే ఆ హామీని కూడా తమ ప్రభుత్వం నిలబెట్టుకోదని చెపుతున్నట్లుంది. ఆ చట్టంలో అవి లేవు కనుక అమలుచేయలేమని తప్పించుకొంటున్నారు. కానీ వాటిని ఆ చట్టంలో చేర్చేందుకు సహకరిస్తామని కాంగ్రెస్ పార్టీ చెపుతున్నప్పుడు మోడీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? చట్టంలో పేర్కొన్న ఆర్ధిక అంశాలపై హామీలను ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పరు. మార్చి 6వ తేదీన రాజమండ్రిలో బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభలో సంతృప్తికరమయిన సమాధానాలు చెప్తారేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

“టెస్ట్” భవిష్యత్‌పై పిడుగేసిన అహ్మదాబాద్ పిచ్..!

వందల కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీస్తారు. కానీ సినిమాకు ఖర్చు పెట్టడం... పైపై హంగుల కోసం అత్యధికంగా ఖర్చుపెడతారు. కానీ కథ ఉండదు.. కథలో సోల్ ఉండదు. అంటే ఆత్మలేని కథతో...

విజ‌యం ముంగిట భార‌త్‌: టార్గెట్ 49

మొతేరాలో బౌల‌ర్ల హ‌వా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో 112 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లోనూ చేతులెత్తేసింది. కేవ‌లం... 81 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. దాంతో.. భార‌త్ ముందు...

“చెప్పు” శ్రీనివాసరావు పాదయాత్రలో జగన్ సపోర్టర్..!

ఏబీఎన్ టీవీ చానల్ చర్చలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టిన కొలికపూడి శ్రీనివాసరావు .. టీడీపీ ప్రోద్భలంతో ఆ పని చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను పూర్తిగా...

మోడీని తీసుకొస్తారు సరే.. మరి డబ్బులు కట్టించగలరా..!?

నిరవ్ మోడీని భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ కోర్టు తీర్పు చెప్పింది. రెండేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ... సమర్థమైన వాదనలు వినిపించిన భారత ఏజెన్సీలు విజయం సాధించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను...

HOT NEWS

[X] Close
[X] Close