ఈసారయినా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాలు జరగనిస్తుందా?

రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఇంత వరకు జరిగిన పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు హైజాక్ చేస్తున్న నేపద్యంలో ఈ సమావేశాలు ఇంచు మించు అలాగే ముగియవచ్చును. కాకపోతే ఇవి బడ్జెట్ సమావేశాలు కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీ కరుణిస్తుందేమో చూడాలి. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిల్లీలో సమావేశం కాబోతోంది. అందులో పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. నిజానికి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహం అంటే అది సభా కార్యక్రమాలు జరుగకుండా ఏవిధంగా అడ్డుకోవలనే చర్చలే. అందుకు ఏఏ అంశాలు తమకు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఏ ఏ సమయాలలో ఎవరు లేవనత్తి సభను ఏవిధంగా అడ్డుకోవలనే దానిపై జరిగే చర్చలనే పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలుగా గొప్పగా చెప్పుకొంటాము.

దేశంలో అభివృద్ధి, ప్రజలలో సుఖ శాంతులకు కరువు ఉంటుందేమో కానీ సమస్యలకు ఎప్పుడూ కరువు ఉండదు. కనుక ప్రతీసారిలాగే ఈసారి కూడా మోడీ ప్రభుత్వంపై దాడి చేయడానికి ప్రతిపక్షాల వద్ద ఫిరంగులవంటి అనేక సమస్యలున్నాయి. వాటిలో హర్యానా జాట్ ల ఉద్యమం (ఆ రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండటం కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం), అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేత, జె.ఎన్.టి.యు. విద్యార్ధి కన్నయ్య కుమార్ అరెస్ట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్ధి రోహిత్ ఆత్మహత్య కేసులో ఇద్దరు కేంద్రమంత్రుల రాజినామాలకి డిమాండ్ వంటివి అనేకం సిద్దంగా ఉన్నాయి.

ప్రతిపక్షాలు తమపై సంధించబోయే ఈ అస్త్రశస్త్రాలను ఎదుర్కోవడానికి మోడీ ప్రభుత్వం కూడా సిద్దం అవుతోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇద్దరూ కూడా సోమవారం వేర్వేరుగా ప్రతిపక్షాలతో సమావేశమయ్యి సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఈ సమావేశాలలో చర్చించి ఆమోదించవలసిన వివిధ బిల్లుల గురించి కూడా వారికి తెలియజేసి వాటి ఆమోదానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. కానీ అటువంటి విజ్ఞప్తులను మన్నించేసి ప్రభుత్వానికి సహకరించేసేందుకు అవేవీ ఎన్డీయే మిత్రపక్షాలు కాదు కనుక యధాప్రకారం ఉభయసభలలో రాద్ధాంతం చేయకుండా ఉండలేవు.

బహుశః ఓం ప్రధమంగా కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయల రాజీనామాలకు డిమాండ్ తో ఆ రభస మొదలుపెట్టవచ్చును. ఆ తరువాత వరుసగా చాలా అంశాలే ఉన్నాయి కనుక బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సభా కార్యక్రమాలను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వద్ద చాలా ఆయుధాలే సిద్దంగా ఉన్నాయి. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేయడమే ఇప్పుడు ఒక గొప్ప వ్యూహంగా భావిస్తున్నాయి కనుక, అధికార పార్టీ వాటిని ఎదుర్కోవడం తప్పనిసరి అయిపోయింది. కానీ ఈ వ్యూహ ప్రతివ్యూహాలలో కీలకమయిన బిల్లులపై, ప్రజా సమస్యలపై సభలో అర్ధవంతమయిన చర్చలు, వాటి పరిష్కారాల కోసం సమాలోచనలు వంటివేవీ లేకుండానే సమావేశాలు ముగిసిపోతున్నాయి. ఈ పరిస్థితి ఎప్పటికయినా మారుతుందో లేదో ఎవరికీ తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close