అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా చక్కర్లు కొడుతోంది. బన్నీ ముంబైలో ఇల్లు కొన్నారని, అక్కడకి షిఫ్ట్ అయిపోతున్నారన్న గాసిప్ బలంగా వినిపించింది. అయితే అది నిజం కాదని తేలిపోయింది. బన్నీ ‘రాకా’ షూటింగ్ కోసం ముంబైలో ఉంటున్నారు. అక్కడ ఓ ఖరీదైన ఇంటిని అద్దెకు తీసుకొన్నారు. షూటింగ్ అయిపోయిన తరవాత, ఆ ఇల్లు ఖాళీ చేస్తారు.
అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం తెలిసింది. బన్నీ ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ ఖరీదైన ఇల్లు కడుతున్నారు. నాలుగువేల చదరపు గజాల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ ఇంటి విలువ దాదాపు రూ.150 కోట్ల వరకూ ఉంటుందని టాక్. హైదరాబాద్ లోని ఖరీదైన సెలబ్రెటీల ఇళ్లల్లో..ఒకటిగా నిలవలాన్న ఉద్దేశంతో ఈ ఇంటి నిర్మాణం చేపట్టారని తెలుస్తోంది. ఈ యేడాది చివరికల్లా ఇల్లు పూర్తవుతుందని, వెంటనే బన్నీ ఆ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోతారని తెలుస్తోంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో బన్నీ నివాసం ఉంది. ఇప్పుడు కడుతున్న ఇల్లు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలో ఉందట. నందమూరి బాలకృష్ణ కొత్త ఇల్లు కూడా ఇదే పరిసరాల్లో నిర్మిస్తున్నారు.