కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్టు కొట్టిన దర్శకుడు చందూ మొండేటి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తండేల్ కూడా మంచి విజయాన్ని అందుకొంది. ‘తండేల్’ తరవాత చందూ సినిమా ఖాయమైంది. ఈసారి ఆయన ఓ మల్టీస్టారర్ ని రూపొందిస్తున్నారు. ముగ్గురు హీరోల కథ ఇది. ఇప్పటికైతే రానా దగ్గుబాటి, అక్షయ్ కుమార్ ఖాయమయ్యారు. మరో హీరో ఎవరన్నది తేలాలి. ఈ చిత్రానికి కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ఉజ్జాయినీ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ ఇది. త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.
కాంబో పరంగా మాత్రం మంచి క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. మూడో హీరో ఎవరన్నదానిబట్టి, ఈ సినిమా క్రేజ్ మరింత పెరుగుతుంది. ‘తండేల్’ తరవాత గీతా ఆర్ట్స్ లోనే చందూ మరో సినిమా చేస్తారని ప్రచారం జరిగింది. సూర్యకు ఓ కథ చెప్పారు. ఆయనకు నచ్చింది. మరెందుకో ఫైనల్ కాలేదు. ఆ తరవాత మరి కొంతమంది హీరోల్ని సంప్రదించారు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ ఖాయం చేసుకొన్నారు. ‘కార్తికేయ 3’ స్క్రిప్టు పనులు కూడా జరుగుతున్నాయి. ఈ మల్టీస్టారర్ పూర్తయ్యాక.. ‘కార్తికేయ 3’ ఉండొచ్చు.


