టీఆర్ఎస్ పేరు ఫ్రీ అయిందని.. ఇప్పుడు దాన్ని ఎవరైనా వాడుకోవచ్చునని గతంలోనే కవిత స్పష్టం చేసింది.ఆమె చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత కేటీఆర్, బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశం పరిశీలనలో ఉందని జగిత్యాల సభకు కొద్దిరోజుల ముందు ప్రకటించడంతో.. ఆ సభలో కేసీఆర్ పార్టీ పేరు మార్పు అంశాన్ని ప్రస్తావించినా.. కవితకు నేడు టీఆర్ఎస్ అని పేరు పెట్టుకునే అవకాశం ఉండకపోయేది.
కానీ, కవిత ఇచ్చినా హింట్ ను కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు గ్రహించలేకపోయారు. కవిత టీం కూడా ముందు జాగ్రత్తగా తెలంగాణ ప్రజా జాగృతి అని పేరు పెడుతున్నట్లుగా లీకులు ఇచ్చారు. కానీ ఎక్కడా టీఆర్ఎస్ అని పెడుతున్నట్లుగా లీక్ చేయలేదు. కవిత ముందస్తుగా ఇచ్చిన హింట్ ను గ్రహించక.. మునుపటి పార్టీ అస్తిత్వాన్ని కవితకు కల్వకుంట్ల ఫ్యామిలీ అప్పగించినట్లుగా తెలుస్తోంది.
పార్టీ పేరును టీఆర్ఎస్ గా ప్రకటించిన కవిత.. ఇప్పుడు ఓ రకంగా బీఆర్ఎస్ పై ఓ రకంగా పైచేయి సాధించినట్లేనని చెప్పుకోవచ్చు.
