ఐపీఎల్ 2026లో ఓ సంచలనం నమోదైయింది. పంజాబ్ కింగ్స్ రికార్డ్ బ్రేకింగ్ ఛేజ్ చేసింది. ఢిల్లీ క్యాపిటల్ ఇచ్చిన 265 పరుగుల లక్ష్యాన్ని 7 బంతులు మిగిలుండగానే పూర్తి చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే హయ్యస్ట్ రికార్డు ఛేజ్. అంతకుముందు కూడా ఈ రికార్డు పంజాబ్ పేరిటే ఉంది. 2024లో కోల్‌కతా నిర్దేశించిన 262 టార్గెట్‌ని పంజాబ్ ఛేజ్ చేసింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. కేఎల్ రాహుల్ (152 నాటౌట్) సెంచరీతో 264 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఐతే ఛేజ్ కి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్ (76), ప్రియాంశ్ ఆర్య (43) అంతకుమించి అన్నట్టుగా చేలరేగిపోయారు, 20 రన్ రేట్ తో కేవలం పవర్ ప్లేలోనే వందపరుగులు రాబట్టేశారు. తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (71)తో అదరగొట్టి జట్టుని గెలిపించాడు.
ఢిల్లీ మైదానం చిన్నది. కొడితే ఫోర్ లేదా సిక్స్ అన్నట్టుగా వుంది. కాకపోతే 262 టార్గెట్ ని చేజ్ చేస్తున్నప్పుడు ఒత్తిడి వుంటుంది కానీ పంజాబ్ ఎక్కడా వెనకడుగువేయలేదు. కాకపోతే ఇందులో ఢిల్లీ చేసి పొరపాట్లు కూడా వున్నాయి. చాలా కీలకమైన సమయంలో క్యాచులు వదిలేశారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ రెండుసార్లు బంతి గాల్లోకి ఎగరేశాడు. రెండుసార్లు కరుణ్ నాయర్ చేతుల్లోకి వెళ్ళింది. కానీ సింపుల్ గా చేతికొచ్చిన క్యాచులు విడిచిపెట్టాడు. దీంతో ఛేజ్ ఇంకా ఈజీ అయ్యింది. ఈ గెలుపుతో టేబుల్ టాపర్ గా నిలిచింది పంజాబ్.
