తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది. ఇందులో తరుణ్, జేడీ చక్రవర్తితో పాటు మూడో సింహం కూడా గాయపడిందని టీజ్ చేస్తూ వచ్చారు. ఆ మూడో సింహాన్ని రివీల్ చేస్తూ ట్రైలర్ విడుదల చేశారు.
‘‘ఈ ప్రపంచంలో కొందరికి ప్రేమ కావాలి, కొందరికి డబ్బు కావాలి.. కొందరికి ప్రపంచమే కావాలి’’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ట్రైలర్లో కథను క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేశారు. అమెరికాలో స్థిరపడాలని కలలు కంటాడు తరుణ్ భాస్కర్. సరిగ్గా అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ఇమిగ్రేషన్ పాలసీల కారణంగా అక్కడి నుంచి డిపోర్ట్ అవుతాడు. దీంతో అతని ప్రేమతో పాటు జీవితం తలకిందులు అవుతుంది. అప్పుడు ఒక విచిత్రమైన నిర్ణయం తీసుకుంటాడు.. ఏకంగా ట్రంప్ మీద రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు. ఆ రివెంజ్ ఎలా సాగిందనేది మిగతా కథ.
దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ యువతకు కనెక్ట్ అయ్యే పాయింట్‌ను పట్టుకున్నాడు. తరుణ్ భాస్కర్ సీరియస్‌గా ఉంటూనే నవ్వులు పంచాడు. జేడీ చక్రవర్తి నెగటివ్ షేడ్‌లో ఉన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో మూడో సింహంగా శ్రీ విష్ణు కనిపించబోతున్నాడు. చివర్లో ఆయన ప్రెజెన్స్ ట్రైలర్‌కు ఫినిషింగ్ టచ్ ఇచ్చింది.
‘‘డాలస్ మూడో తెలుగు రాష్ట్రం..’’
‘‘ట్రంప్ మీద రివెంజ్ ఏంట్రా.. బయటకు తెలిస్తే మన దేశం పరువు పోతుంది.. ట్రంప్‌కు తెలిస్తే దేశమే పోతుంది’’ వంటి డైలాగులు ట్రైలర్లో నవ్వులు పంచాయి.
మొత్తానికి ‘గాయపడ్డ సింహం’లో యువతకు కావాల్సిన వినోదం ఉందని ట్రైలర్ భరోసా ఇచ్చింది. ట్రంప్ మీద రివెంజ్ ఎలా సాగిందో మే 1న తెలుస్తుంది.
