కల్వకుంట్ల కవిత అన్నంత పని చేశారు. తన పార్టీ పేరును టీఆర్ఎస్గా ప్రకటించారు. అయితే తెలంగాణ రాష్ట్ర సమితిగా ప్రకటించడానికి సాంకేతిక ఇబ్బందులు రావడంతో..తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. మేడ్చల్ లో నిర్వహించిన ఆవిర్భావ బహిరంగసభలో కవిత తన పార్టీ పేరును ప్రకటించారు. ముహుర్తం ప్రకారం ఉదయమే తన పార్టీ ప్రకటన చేశారు. ఆవిర్భావసభకు రాష్ట్ర వ్యాప్తంగా జన సమీకరణ చేశారు. కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించినా .. .దాదాపుగా యాభై వేల మంది హాజరయ్యారు. పార్టీ జెండా కూడా ఆవిష్కరించారు.
పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన గా ప్రకటించడం వెనుక కవిత వ్యూహాత్మక ఆలోచన కనిపిస్తోంది. మహారాష్ట్రలో శివసేన ఏ విధంగానైతే ప్రాంతీయ అస్తిత్వం కోసం తీవ్రస్థాయిలో పోరాడుతుందో, అదే తరహాలో తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామనే సంకేతాన్ని ఆమె పంపారు. కేవలం రాజకీయ పార్టీగానే కాకుండా, తెలంగాణ హక్కులను కాపాడే ఒక రక్షణ కవచంలా ఈ పార్టీ పనిచేస్తుందని ఆమె స్పష్టం చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిపోయిన తరుణంలో, తెలంగాణ గుండె చప్పుడు వినిపించే అసలైన ప్రాంతీయ పార్టీ ఇదే అని ఆమె భావన
ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకే పార్టీ ప్రకటన , జెండా ఆవిష్కరణ పూర్తి చేశారు. కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగినప్పటికీ, పరిసర ప్రాంతాలన్నీ జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధపేట వంటి ప్రాంతాల నుండి కవిత మద్దతుదారులు తరలి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో కొత్త తరం నాయకత్వానికి, ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన ఆవిర్భావంతో రాష్ట్రంలో ఇప్పుడు చతుర్ముఖ పోటీ ప్రారంభమవుతుంది.
