పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ ప్రమోషన్స్ ని మరోసారి ముమ్మరం చేశారు. జూన్ 12న ప్రేక్షకుల ముందుకురానున్న నేపధ్యంలో సినిమా నుంచి ‘సలసల మరిగే నీలోని రక్తమే…’ అంటూ సాగే పాటను విడుదల చేశారు.
సమర శంఖారావం వలె ఘీకరించు ఆగ్రహం
వైరమైన శౌర్యమైన మ్రోగు మరణ మృదంగం
క్రూర మృగం వల్లే వెంబడించు ఆక్రోశం
శత్రువైన మృత్యువైన మోకరిల్లు ప్రతాపం.. అంటూ రాంబాబు గోశాల రాసిన లిరిక్స్ ఓ యుద్ధాన్ని తలపించాయి. కీరవాణి స్వర రచన మరోస్థాయిలో వుంది. నిజంగానే పౌరుషాన్ని రగిలించేలా వుంది ఆయన బాణీ. ఈ పాటలో వీరమల్లు ధైర్య సాహసాలని చిత్రీకకరించి తీరు, పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలా వున్నాయి. మొత్తానికి ఈ తాజా పాట వీరమల్లు కథపై ఆసక్తిని పెంచింది.