‘అశ్వ‌ద్ధామ’ టీజ‌ర్‌: థ‌్రిల్లింగ్‌ యాక్ష‌న్ ధ‌మాకా

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు స‌రిగ్గా స‌రిపోతాడు నాగ‌శౌర్య‌. త‌న హిట్ సినిమాలన్నీ ల‌వ్ స్టోరీ నేప‌థ్యంలోంచి వ‌చ్చిన‌వే. తొలిసారి యాక్ష‌న్ వైపు దృష్టి పెట్టాడు. త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో, త‌ను రాసిన క‌థ‌తో తెర‌కెక్కుతున్న `అశ్వ‌ద్ధామ‌` యాక్ష‌న్ స్టోరీనే. ఈ సినిమాతో శౌర్య స్నేహితుడు ర‌మ‌ణ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. జ‌న‌వ‌రి 31న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈరోజు స‌మంత చేతుల మీదుగా టీజ‌ర్ వ‌దిలారు.

ఎలా ఉంటాడో కూడా తెలియ‌ని ఓ రాక్ష‌సుడు…
వాడికి మాత్ర‌మే తెలిసిన ఓ ర‌హ‌స్యం
సైర‌న్ కూత‌ల కింద ప‌ని చేసే వాడి సైన్యం
గ‌మ్యం తెలియ‌ని ఒక యుద్ధం
ఆ యుద్ధం గెలవాలంటే ఓ ఆరడుగుల నారాయ‌ణాస్త్రం కావాలి
ఒక అశ్వ‌ద్ధాముడు రావాలి

– అనే డైలాగుతో టీజ‌ర్ ని క‌ట్ చేశారు. యాక్ష‌న్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఇది. రొమాంటిక్ శౌర్య కాస్త ఈ సినిమాలో యాక్ష‌న్ హీరోగా మారిపోయాడు. షాట్స్ క‌ట్ చేసిన విధానం, టీజ‌ర్‌లో వినిపించిన డైలాగ్‌ని బ‌ట్టి చూస్తే ఓ ఇంటెన్సిటీ క‌నిపిస్తున్నాయి. శౌర్య‌లో ఓ సీరియ‌స్‌, సిన్సియ‌ర్ యాంగిల్ చూడొచ్చ‌ని పిస్తోంది. అన‌వ‌స‌ర‌మైన బిల్డ‌ప్పుల జోలికి పోకుండా – కేవ‌లం క‌థ‌లోని పాయింట్‌ని మాత్ర‌మే చెప్పే ప్ర‌య‌త్నం టీజ‌ర్‌లో క‌నిపించింది. నేప‌థ్య సంగీతం సైతం ఆ ఇంటెన్సిటీని పెంచింది. మొత్తానికి టీజ‌ర్‌లో విష‌యం క‌నిపిస్తోంది. అదే తెర‌పైనా ప్ర‌తిబింబిస్తే… నాగ‌శౌర్య ఖాతాలో మ‌రో హిట్టు ప‌డ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com