ఏపీ సర్కార్‌పై అశ్వనీదత్, కృష్ణంరాజు న్యాయపోరాటం..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాపై సినీ నిర్మాత అశ్వనీదత్, రెబల్ స్టార్ కృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్లు వేశారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం తమ భూముల్ని తీసుకుని ఇస్తామన్న పరిహారం ఇవ్వలేదని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచారు. ఆ సందర్భంగా రన్‌వేను విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. కానీ తగినంత భూమి అందుబాటులో లేదు. అక్కడ భూసేరకణ చేయడం ఎయిర్‌పోర్ట్స్ ఆధారిటీ ఆఫ్ ఇండియాకు అసాధ్యంగా మారింది. ఎందుకంటే.. రాష్ట్ర విభజనకు ముందు నుంచీ అక్కడ భూమి ఎకరం కోట్లలోనే ఉంది.

విజయవాడను అంతర్జాతీయ నగరంగా మార్చాలన్న పట్టుదలతో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భూ యజమానులకు ఓ ఆఫర్ ఇచ్చారు. గన్నవరం విమానాశ్రయం రన్‌వేకు అవసరమైన భూములు ఇస్తే.. ఆ మేరకు.. రాజధాని అమరావతిలో స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దాంతో.. చాలా మంది రైతులు తమ భూములను ఇచ్చారు. ఇలా ఇచ్చిన వారిలో.. అశ్వనీదత్, కృష్ణంరాజు కూడా ఉన్నారు. అశ్వనీదత్ 39 ఎకరాలిచ్చారు. కృష్ణంరాజు 31 ఎకరాలు ఇచ్చారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అమరావతిని అటకెక్కించేసింది. దాంతో వారు తమకు అన్యాయం జరుగుతోందని హైకోర్టుకు వెళ్లారు.

ల్యాండ్‌ పూలింగ్‌ కింద ప్రభుత్వానికి తన పొలం ఇచ్చే సమయంలో ఎకరానికి రూ. కోటి 54 లక్షల విలువ ఉందని అశ్వినీదత్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ భూమికి సరిసమానమైన అంతే విలువ కలిగిన భూమిని.. రాజధాని అమరావతిలో కేటాయిస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని.. ఇప్పుడు రాజధానిని వేరే చోటకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించినందున.. అక్కడి భూమి ఎకరం రూ.30 లక్షలు కూడా విలువ చేయని పరిస్థితి ఏర్పడిందన్నారు. నిబంధనల ప్రకారం తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని.. ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పిటిషన్‌లో పార్టీలుగా ఆశ్వనీదత్ చేర్చారు. ప్రస్తుతం నేను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ విలువ.. ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందని .. ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ లేదా ప్రభుత్వం…నిర్మాణాలు చేసుకోవచ్చని అశ్వనీదత్ అంటున్నారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా విడిగా తన పిటిషన్ వేసారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ విస్తరణలో తమ భూమికి సరైన నష్టపరిహారం చెల్లించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. భూములు ఇచ్చిన రైతులు పలువులు ఇప్పటికే తమ భూముల్లో పంటలు సాగు చేసుకుంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియాతో పాటు.. ప్రభుత్వానికి ఇబ్బంది తెచ్చి పెడుతోంది. సీఆర్డీఏను రద్దు చేసినందున.. రైతులందరికీ కలిపి వేల కోట్ల పరిహారం చెల్లించాల్సి రావొచ్చన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close