శేఖర్ రెడ్డి వద్ద దొరికిన ఆ “కోట్లు” సాక్ష్యాలు కావా..!?

టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్‌రెడ్డికి సీబీఐ కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆయన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని.. కేసు మూసివేయవచ్చని సీబీఐ అధికారులు కోర్టుకు చెప్పడంతో ఈ మేరకు కోర్టు కేసులను కొట్టి వేస్తూ తీర్పు చెప్పింది. దీంతో శేఖర్ రెడ్డిపై ఏ కేసూ లేకుండాపోయింది. పాత నోట్లు, అక్రమ బంగారం వ్యవహారంలో.. శేఖర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై గతంలో సీబీఐ కేసులను నమోదు చేసింది. చివరకు క్లీన్‌చిట్‌తో ఆయన బయట పడ్డారు.

శేఖర్ రెడ్డి ఏపీ ప్రజలకే కాదు.. దేశం మొత్తానికి పరిచయం అక్కర్లేని పేరు. ఎందుకంటే నోట్లను రద్దు చేసినప్పుడు.. ప్రజలంతా.. చెల్లుబాటయ్యే నోటు ఒక్కటంటే.. ఒక్కదాని కోసం.. ఏటీఎంల ముందు… రోజంతా పడిగాపులు పడుతున్న సమయంలో… ఈ శేఖర్ రెడ్డి ఇంట్లో.. కోట్లకు కోట్ల కొత్త నగదు పట్టుబడింది. పెట్టెల నిండా కొత్త నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఏటీఎంలలో పెట్టడానికి నగదే లేదని ఆర్బీఐ అంటోన్న సమయంలోనే… అంతకు మించిన నిధి.. ఆయన ఇంట్లో దొరికింది. దాదాపుగా రూ.34కోట్ల రెండు వేల రూపాయల నోట్ల కట్టలు శేఖర్‌రెడ్డి ఇంట్లో దొరికాయి.

ఆ టైంలో శేఖర్‌రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. దీంతో ఈ డబ్బు అంతా చంద్రబాబుది అని, శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అంటూ బీజేపీ, వైసీపీ విమర్శలు చేశాయి. పవన్ కల్యాణ్.. ఈ శేఖర్ రెడ్డికి.. లోకేష్‌కు కూడా లింక్ పెట్టారు. అప్పుడు చంద్రబాబు టీటీడీ బోర్డు సభ్యుడి పదవి నుంచి తొలగించారు. అప్పట్లో ఆరోపణలు చేసిన జగన్.. అధికారంలోకి రాగానే మళ్లీ అదే పదవి ఇచ్చారు. ఇంతకు ముందే ఆయనకు ఐటీ శాఖ కూడా క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ సొమ్మంతా.. వ్యాపారవాదేవీల్లో వచ్చిందని.. ఐటీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసింది. అసలు కొత్త నోట్లు క్యాష్ రూపంలో కోట్లకు కోట్లు వచ్చే వ్యాపారం ఏమిటో మాత్రం వారు చెప్పలేకపోయారు.

శేఖర్ రెడ్డి వద్ద దొరికిన కొత్త నోట్లు.. భారీ బంగారం కడ్డీలే సాక్ష్యం. అంతకు మించి ప్రత్యేకమైన సాక్ష్యాలు అక్కర్లేదు. కానీ ఇంత రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారిపై కూడా సీబీఐ, ఐటీ కేసులు ఎత్తివేస్తూ… సాక్ష్యాలు లేవని చెప్పుకుటూ.. ప్రజల్ని బకరాలను చేస్తూ.. అక్రమాలకు ప్రోత్సాహం ఇస్తూ ఉంటే.. ఇక సామాన్యుడికి వ్యవస్థలపై నమ్మకం ఎలా కలుగుతుంది..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close