సమాజంలో ప్రతి ఒక్కరికి నెగెటివ్ పబ్లిసిటీ మీద మోజు పెరిగిపోయింది. రాజకీయాల్లో అయినా.. సినిమాల్లో అయినా బూతులందుకుంటే చాలా బోలెడంత ప్రచారం వస్తుందని అదే పని చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఓ నేత ఇలాగే చేసి .. జైలు పాలయ్యాడు. ఇదేదో బాగుందని ఓ చోటా సినిమా యాక్టర్ కూడా అదే పని ప్రారంభించాడు. ఓ బూతు పాట రాసుకొచ్చి అందరికీ చదివించి వినిపించాడు. పని లేనోళ్లంతా… మీడియాలో..సోషల్ మీడియాలో తనపై పడిపోతే కావాల్సినంత పబ్లిసిటీ వస్తుందని వీరిలా రెచ్చిపోతున్నారు.
బూతులతో వైరల్ అయ్యేందుకు బరితెగిస్తున్న మంద
గుర్తింపు కోసం పాకులాడే క్రమంలో నెగెటివ్ పబ్లిసిటీ ఒక మత్తుమందులా మారింది. రాజకీయ రంగమైనా, గ్లామర్ ప్రపంచమైనా.. మంచి పనుల ద్వారా పది మందికి తెలియడం కంటే, పచ్చి బూతులతోనో లేదా వివాదాస్పద వ్యాఖ్యలతోనో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ధోరణి పెరిగిపోతోంది. ఎంత ఘోరంగా మాట్లాడితే అంత ఎక్కువ వ్యూస్ , ఎన్ని బూతులు తిడితే అంత ఎక్కువ ట్రెండింగ్ అవుతామనే భ్రమలో కొందరు తమ వ్యక్తిత్వాన్ని బజారున పడేసుకుంటున్నారు. నిన్నటికి నిన్న ఒక రాజకీయ నాయకుడు హద్దులు దాటి మాట్లాడి కటకటాల పాలైన ఘటన మరవకముందే, ఇప్పుడు సినిమా రంగంలోనూ అదే బాటలో కొందరు పయనించడం ఆందోళన కలిగిస్తోంది.
కళాకారులా.. కలుపు మొక్కలా?
తాజాగా ఓ చిన్న స్థాయి నటుడు తన సినిమా ప్రచారం కోసం ఏకంగా ఒక బూతు పాటను రాసుకొచ్చి, దాన్ని బహిరంగంగా చదివి వినిపించడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. పనిలేని వారంతా సోషల్ మీడియాలో తనను తిట్టిపోస్తే, ఆ నెగెటివ్ కామెంట్లే తనకు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెడతాయని సదరు నటుడు భావించడం అత్యంత హేయమైన చర్య. విమర్శలు కూడా ఒక రకమైన ప్రచారమే అని నమ్మే ఇలాంటి వారి వల్ల అసలైన కళాకారుల గౌరవం మంటగలుస్తోంది. మీడియా మైకులు ముందున్నాయని ఏది పడితే అది మాట్లాడితే జనం హర్షిస్తారనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. టీవీ రంగంలో దశాబ్దాలుగా పాతుకుపోయిన తన తండ్రి అండ చూసుకుని సదరు నటుడు ఈ రకమైన ప్లాన్ చేసుకున్నాడు. బూతులు తిట్టి వార్తల్లో నిలవాలనుకోవడం కంటే, కనీసం సభ్యత కలిగిన ప్రవర్తనతో గుర్తింపు తెచ్చుకోవడం ఉత్తమమని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
బట్టలిప్పదీసి రోడ్డు మీద తిరిగితే ఇంకా ఎక్కువ ప్రచారం !
ప్రచారం కోసం బూతులందుకునే బదులు, బట్టలిప్పేసి రోడ్డు మీద తిరిగితే ఇంకా ఎక్కువ ప్రచారం వస్తుంది కదా అన్న సలహాలు వస్తున్నాయి. పబ్లిసిటీ కోసం పాకులాడే ఈ చౌకబారు వేషాలు యువతపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే నాలుగు లైకులు, షేర్ల కోసం సంస్కారాన్ని వదిలేయడం వల్ల సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారో వీరు ఆలోచించడం లేదు. కేవలం నెగెటివ్ పబ్లిసిటీ కోసమే బూతులు మాట్లాడే వారికి మీడియా కూడా ప్రాధాన్యత ఇవ్వకూడదు. గబ్బు కొట్టే పనులతో గుర్తింపు కోరుకునే వారిని సమాజం బహిష్కరించకపోతే, భవిష్యత్తులో ఈ బూతు సంస్కృతి మరిన్ని అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉంది.
