మీడియా వాచ్: సాక్షి ఏపీ సర్క్యలేషన్ 2 లక్షలేనా ?

దినపత్రికల సర్క్యూలేషన్‌ను నిర్ణయించే అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ కీలక విషయాలను వెల్లడించింది. ఎంత అధికార దుర్వినియోగం చేస్తున్నా సాక్షి పత్రిక ఈనాడు దరి దాపుల్లోకి కూడా రావడం లేదు. తాజాగా గత డిసెంబర్ నాటికి ఏ పేపర్‌కు ఎంత సర్క్యూలేషన్ ఉందో అడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యూలేషన్ అంకెలు రిలీజ్ చేసంది. ఈనాడు పత్రికకు 13 లక్షల యాభై వేలకుపైగా కాపీల సర్క్యూలేషన్ ఉంటే.. సాక్షిది పది లక్షల దగ్గర ఉంది. అంటే.. మూడున్నర లక్షలకుపైగా కాపీలు ఈనాడువి ఎక్కువ. ఈ సర్క్యూలేషన్ ఏపీ, తెలంగాణ మొత్తం కలిపి.

అదే ఏపీ ఒక్క రాష్ట్రం తీసుకుంటే ఈనాడు సర్క్యూలేషన్ 7 లక్షల 55 వేలు కాగా .. సాక్షి పత్రిక సర్క్యూలేషన్ 5 లక్షల 85వేలు. నిజానికి ఈ ఐదు లక్షల సర్క్యూలేషన్లో ప్రజాధనంతోనే మూడు లక్షలకుపైగా కాపీలను కొంటున్నారు. రెండున్నర లక్షల మంది వాలంటీర్లకు రూ. రెండు వందలు ఇచ్చి మరీపేపర్ కొనిపిస్తున్నారు. అలాగే ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో రెండేసి పేపర్లు వేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి పేపర్లు కొనిపిస్తున్నారు. యూనివర్శిటీలు సహా ఇతర చోట్ల.. బలవంతంగా పేపర్ అంట కడుతున్నారు. ఇంత చేస్తున్నా ఆ పత్రిక సర్క్యూలేషన్ … ఏపీలో ఆరు లక్షలు కూడా లేదంటే.. డబ్బులు పెట్టే కొనే నిఖార్సైన పాఠకులు సాక్షి పత్రికకు పూర్తిగా అడుగంటి పోయారని స్పష్టమవుతోంది.

ఖచ్చితంగా సాక్షికి రెండు లక్షలు మాత్రమే సర్క్యులేషన్ ఉంటుందని… దారుణంగా పడిపోయింది కాబట్టే.. ప్రజాధనంతో కొనిపిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇలా వాలంటీర్లతో పత్రికను కొనిపించడంపై ఈనాడు సుప్రీంకోర్టులో కేసు వేసింది. విచారణ జరగాల్సి ఉంది. మరో వైపు ఇంత చేసినాసాక్షి పేపర్ మెరుగుపడకపోవడంతో ప్రభుత్వం మారితే కప్పకూలిపోతుందన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలు సర్క్యూలేషన్ లేకపోయినా వందల కోట్ల ప్రజాధనం .. ఆ పత్రికకు కట్టబెడుతున్నారు. మొత్తంగా ఈనాడు … కరోనా అనంతర పరిస్థితుల్ని తట్టుకుని నిలబడుతోంది కానీ.. సాక్షి పునాదులు కదిలిపోయాయని… అప్పనంగా దొరకిన అధికారంతో ప్రజాసొమ్ముతో నిలబెడుతున్నారని అంచనాకు వస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close