” కేసీఆర్ బేరాల్ని ” బయట పెట్టిన రాజ్ దీప్ సర్దేశాయ్ !

ఏపీలో ఒంటరిగా పోటీ చేయడం లేదా బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడం చేస్తే రూ. వెయ్యి కోట్లు అయినా సరే ఎన్నికల ఖర్చు అంతా భరిస్తానని కేసీఆర్ .. జనసేనానికి ఆఫర్ ఇచ్చారని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే బయట పెడితే సంచలనం అయింది. ఆయనను తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్ట్ అయిన రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా అదే చెబుతున్నారు. బీజేపీపై పోరాడే ప్రంట్‌కు చైర్మన్‌గా తనను చేస్తే … ఆ కూటమిలో ఉన్న పార్టీల ఎన్నికల ఖర్చు అంతా తాను పెట్టుకుంటానని ఆఫర్ ఇచ్చారని రాజ్ దీప్ సర్దేశాయ్ స్పష్టం చేశారు.

తన చానల్‌లో ఆయన దేశ రాజకీయాలపై ఓ విశ్లేషణాత్మక వీడియో చేశారు. ఇందులో కేసీఆర్ వ్యూహాల గురించి వివరించారు. కేసీఆర్ చేసిన డబ్బుల ఆఫర్ గురించి కూడా వివరించారు. అయితే ఆయా పార్టీలు డబ్బులతో రాజకీయాలు కావని అనుకున్నారేమో కానీ ఎక్కువ మంది స్పందించలేదు. కానీ కేసీఆర్ చేసిన ఆఫర్ మాత్రం టాం టాం అవుతోంది. ఇప్పటికే కేసీఆర్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణలో దోచుకుని దాన్ని దేశంలో ఎన్నికలపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారని మండిపడుతున్నారు.

మరో వైపు ఇప్పటికే కేసీఆర్ అనేక ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ ఇస్తానని హామీ ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఆర్థిక సాయం చేశారని కూడా అంటున్నారు. ఇంత డబ్బు కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చిందని కేంద్ర ఏజెన్సీలు కూడా ఆరా తీస్తున్నాయని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పుడు రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close