హైదరాబాద్‌లో తాజ్ బంజారా హోటల్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. స్టార్ హోటల్స్ ట్రెండ్ లో వచ్చిన మొదటి తరం హోటల్. ఇప్పుడా హోటల్ చేతులు మారింది. అరబిందో వారసుడు..విజయసాయిరెడ్డి వియ్యంకుడి కుమారుడు, లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లిన శరత్ చంద్రారెడ్డికి చెందిన ఔరో రియాల్టీ.. ఈ హోటల్ ను కొనుగోలు చేసింది.
దాదాపు 3.5 ఎకరాల్లో విస్తరించి ఉన్న తాజ్ బంజారా హోటల్ స్థలాన్ని, హోటల్‌ను రూ. 315 కోట్లకు** కొనుగోలు చేసింది. నాలుగు దశాబ్దాలకు పైగా లీజు ప్రాతిపదికన తాజ్-జీవీకే హోటల్స్ ఆధ్వర్యంలో నడిచింది. 2023లో లీజు గడువు ముగియడంతో, భూ యజమాని ఈ విలువైన స్థలాన్ని రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించారు. ఈ కొనుగోలు లావాదేవీ అక్టోబర్ 31, 2025 న జరిగింది, దీనికి గాను సంస్థ రూ. 17.3 కోట్లు స్టాంప్ డ్యూటీ చెల్లించింది.
ఔరో రియాలిటీ అసలు పేరు అరబిందో రియాలిటీ. లిక్కర్ స్కామ్ లో శరత్ రెడ్డి అరెస్టు అయిన తర్వాత కంపెనీకి చెడ్డపేరు వస్తోందని ఆయనను ఫార్మా కంపెనీ బాధ్యతల నుంచి తప్పించారు. కానీ ఆ ఫార్మాతో సంబందం లేకుండా ఆయన విడిగా అరబిందో రియాలిటీ కంపెనీ పెట్టుకున్నారు. రెండు పేర్లూ ఒకేలా ఉండటం ఏమిటని.. వాటాదార్లు అభ్యంతర పెట్టడంతో ఔరో రియాలిటీగా మార్చారు.
ఈ ఔరో రియాలిటీ ప్రారంభమైన వెంటనే చాలా పనులు చేసింది. జగన్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున బెదిరిపంపుకు పాల్పడి పోర్టులు.. ఇతర ఆస్తులు లాక్కుందని ఆరోపణలు వచ్చాయి. శరత్ రెడ్డి,ఆయన తమ్ముడు క్రికెట్ అసోసియేషన్ లోనూ హవా చూపించారు. హైదరాబాద్ లో .. గచ్చిబౌలితో పాటు హైటెక్ సిటీ వద్ద కూడా హైరైజ్ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. బంజారాహిల్స్ ల్యాండ్ కొనడం ద్వారా… హోటల్ ను మూసేసి.. భారీ హైరైజ్ అపార్టుమెంట్ ను నిర్మించాలనే ఆలోచన ఔరో రియాల్టీ చేస్తోంద.
