తన హత్యకు అఖిలప్రియ కుట్ర చేసిందన్న ఏవీ సుబ్బారెడ్డి..!

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తన హత్యకు సుపారీ ఇచ్చారని..కర్నూలు టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొన్ని రోజుల క్రితం.. కడప జిల్లాలో ఏవీ సుబ్బారెడ్డి హత్యకు కుట్ర పన్నిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. యాభై లక్షల రూపాయల సుపారీ తీసుకున్నారని.. పోలీసులు గుర్తించారు. అయితే.. సుపారీ ఎవరు ఇచ్చారు…అన్నదాన్ని మాత్రం ఇంకా విచారణలో తెలుసుకోలేకపోయారు. అయితే హఠాత్తుగా ఏవీ సుబ్బారెడ్డి మీడియాను పిలిచి.. భూమా అఖిలప్రియపై సంచలన ఆరోపణలు చేశారు. ఆమెతో పాటు.. ఆమె భర్త.. భార్గవ తనను చంపేందుకు కుట్ర పన్నారని .. రవిచంద్రారెడ్డి, రాంరెడ్డి, సూడో నక్సలైట్‌ సంజోరెడ్డితో… రూ.50లక్షలకు సుఫారీ కుదుర్చుకున్నారని ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. మహిళ ముసుగులో అఖిలప్రియ ఫ్యాక్షన్‌ రాజకీయాలకు తెరలేపారని.. మండిపడ్డారు.

రాజకీయ కుట్రతోనే నా హత్యకు అఖిలప్రియ ప్రణాళిక వేసిందని.. అఖిప్రియను, ఆమె భర్త భార్గవను వెంటనే అరెస్ట్‌ చేయాలని సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఏ.వీ. సుబ్బారెడ్డి భూమా కుటుంబానికి అత్యంత ఆప్తుడు. భూమా నాగిరెడ్డికి కుడి భుజంగా వ్యవహరించారు. ఆయన ఎక్కడ ఉంటే…ఏవీ సుబ్బారెడ్డి అక్కడ ఉండేవారు. అఖిలప్రియ కూడా ఆయనను మామా అని పిలిచేవారు. అయితే.. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఏవీ సుబ్బారెడ్డితో భూమా అఖిలప్రియకు.. విబేధాలు వచ్చాయి. ఏ వీ సుబ్బారెడ్డి రాజకీయంగా ఎదిగేందుకు ప్రయత్నించడం.. నంద్యాల ఉపఎన్నికల్లో టిక్కెట్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత ఆళ్లగడ్డలోనూ…రాజకీయ పర్యటనలు చేశారు. దీంతో..సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు ఏవీ సుబ్బారెడ్డికి ఓ నామినేటెడ్ పదవి ఇచ్చి బుజ్జగించారు.

ఎన్నికలు అయిపోయి.. ఓడిపోయిన తర్వాత కూడా.. అఖిలప్రియతో సంబంధాలు మెరుగుపడలేదు. ఇప్పుడు.. అవి హత్యా ఆరోపణలు వరకూ వెళ్లాయి. అఖిలప్రియ ఆళ్లగడ్డ … ఆమె సోదరుడు నంద్యాల అసెంబ్లీ సీట్లకు ఇన్చార్జ్ గా ఉన్నారు. ఏ.వీ.సుబ్బారెడ్డి హత్యకు ఎవరు కుట్ర పన్నారో.. ఎవరు సుపారీ ఇచ్చారో పోలీసులు చెప్పక ముందే… సుబ్బారెడ్డి భూమా అఖిలప్రియను టార్గెట్ చేయడం.. రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్‌: ఈనాడులో గంద‌ర‌గోళం

తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకుని, త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌డంలో ఈనాడుకి తిరుగులేదు. ప‌దేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవ్వ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌. అయితే...

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ” అనంత పద్మనాభుని” బాధ్యతలు..!

దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అలాగే త్రివేండ్రం...

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టేస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

HOT NEWS

[X] Close
[X] Close