బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10… బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య భావిస్తున్న‌ట్టు టాక్‌. ఈనెల 10న ఆయ‌న ఓ విందు కూడా ఇవ్వ‌బోతున్నార‌ని తెలుస్తోంది. లాక్ డౌన్ నేప‌థ్యంలో విందు, వినోదాల‌కు ప‌రిమితులున్నాయి. త‌క్కువ సంఖ్య‌లోనే అతిథులు హాజ‌ర‌వ్వాలి. ఆ లెక్క‌లు వేసుకునే బాల‌య్య‌.. విందు ఇవ్వ‌బోతున్నార‌ని స‌మాచారం. ప‌రిశ్ర‌మ‌లోని త‌న‌కు అత్యంత స‌న్నిహితుల్ని, కుటుంబ స‌భ్యుల్ని ఆహ్వానిస్తున్నార్ట‌. మ‌రి ఈ విందుకు చిరంజీవికి ఆహ్వానం ఉందా? ఉంటే ఆయ‌న వ‌స్తారా? అనేది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`ప‌రిశ్ర‌మ‌లోనే నేను క్లోజ్ గా ఉండేది ఒక్క చిరంజీవితోనే` అని బాల‌య్య ఓ సంద‌ర్భంలో చెప్పారు. మేమిద్ద‌రం మంచి స్నేహితులం అని అటు చిరు, ఇటు బాల‌య్య ఇద్ద‌రూ ప‌దే ప‌దే చెబుతుంటారు. కానీ ఈమ‌ధ్య వ్య‌వ‌హారాలు అలా లేవు. ముఖ్యంగా `ఆస్తులు పంచుకుంటున్నారా` అనే బాల‌య్య కామెంట్ ప‌రోక్షంగా చిరుకి త‌గిలేదే. దానికి తోడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు వ్యాఖ్య‌లు అగ్గిమీద గుగ్గిలం రేపాయి. ఈ నేప‌థ్యంలో చిరు – బాల‌య్య‌ల క‌ల‌యిక త‌ప్ప‌కుండా ఆస‌క్తి క‌లిగించేదే. ఒక వేళ నిజంగా వీరిద్ద‌రూ క‌లిస్తే… త‌ప్ప‌కుండా ప‌రిశ్ర‌మ‌కు, ఇరు హీరోల అభిమానుల‌కు ఓ చ‌క్క‌టి సంకేతం పంపిన‌ట్టు అవుతుంది. ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న గ్యాప్ తొల‌గిపోతుంది. దానికి తోడు ప‌రిశ్ర‌మ‌లో నెల‌కున్న ఓ అనారోగ్య క‌ర‌మైన వాతావ‌ర‌ణానికి చెక్ పెట్టిన‌ట్టు అవుతుంది. ఛాయిస్ బాల‌య్య‌దే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మీడియా వాచ్‌: ఈనాడులో గంద‌ర‌గోళం

తెలుగు మీడియా రంగంలో రారాజు.. ఈనాడు. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో ఉంచుకుని, త‌న‌ని తాను మ‌ల‌చుకోవ‌డంలో ఈనాడుకి తిరుగులేదు. ప‌దేళ్ల ముందుకెళ్లి ఆలోచించుకుని, అందుకు త‌గ్గ‌ట్టుగా స‌ర్వ‌స‌న్న‌ద్ధం అవ్వ‌డం ఈనాడు ప్ర‌త్యేక‌త‌. అయితే...

ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే ” అనంత పద్మనాభుని” బాధ్యతలు..!

దేశంలో అత్యంత ధనిక ఆలయంగా పేరు తెచ్చుకున్న కేరళలోని అనంతపద్మనాభ స్వామి ఆలయం బాధ్యత ట్రావెన్‌కోర్ రాజ కుటుంబానిదేనని.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తుది తీర్పు వెలువరించింది. అలాగే త్రివేండ్రం...

జగన్ పార్టీకి ” వైఎస్ఆర్” నోటీసులొచ్చాయ్..!

జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని యువజన శ్రామిత రైతు కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును ఎలా వాడుకుంటున్నారంటూ.. ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలా...

పవన్ కి మద్దతివ్వను, జగన్ ని ప్రశ్నించను, కేంద్రంపై నెట్టేస్తా, తప్పుకుంటా: ముద్రగడ లేఖ

ముద్రగడ పద్మనాభం తమ జాతిని ఉద్దేశించి మరొకసారి సుదీర్ఘమైన లేఖ రాశారు. 2 వారాల క్రితం ముద్రగడ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి రాసిన లేఖ సొంత సామాజిక వర్గం నుండే విమర్శలు పొందడం...

HOT NEWS

[X] Close
[X] Close