వైసీపీలోకి అనకాపల్లి టీడీపీ ఎంపీ..! మైండ్ గేమేనా..?

ఆదివారం సాయంత్రం హఠాత్తుగా.. అనకాపల్లి టీడీపీ ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అలియాస్ అవంతి శ్రీనివాస్.. ఈ నెల ఇరవై ఒకటో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఇవి ఎక్కడ పుట్టాయో కానీ… శరవేగంగా.. వ్యాపించాయి. వెంటనే ఈ ప్రచారంపై.. స్పందించిన అవంతి శ్రీనివాస్‌ పార్టీ మారే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. దీని వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పదకొండో తేదీ నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో… విభజన హామీలపై పోరాడుతానన్న ఉద్దేశంతోనే.. ఇలాంటి ప్రచాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని ప్రజలను కోరారు.

అయితే రాజకీయాల్లో నిప్పు లేనిదే పొగ రాదని ప్రచారం జరుగుతూ ఉంటుంది. కానీ.. ఇలా నిప్పు పెట్టి పొగ తెచ్చి.. మైండ్ గేమ్ ప్రారంభించే విధానం కూడా.. ఎక్కువే. ఎవరైనా పార్టీలో నాయకుడు అసంతృప్తిగా ఉన్నారని అనిపించి.. ఆ నేత తమకు ఉపయోగపడతారనుకుంటే.. మైండ్ గేమ్ ప్రారంభిస్తారు. తమ పార్టీలోకి వస్తున్నారని ప్రచారాన్ని అండర్ కరెంట్‌గా ప్రారంభించి .. చివరకు లాగేసే వరకూ ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్‌పైనా అలాంటి మైండ్ గేమ్ ఆడుతున్నారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పీఆర్పీ నుంచి రాజకీయ ప్రవేశం చేసిన అవంతి శ్రీనివాస్ …ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి గెలిచారు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనం తర్వాత… ఆ పార్టీలో చేరారు. కానీ గత ఎన్నికల ముందు గంటాతో కలిసి.. టీడీపీలో చేరిపోయారు. కానీ భీమిలి నుచి గంటా పోటీ చేశారు. అనకాపల్లి ఎంపీగా అవంతి శ్రీనివాస్ పోటీ చేసి గెలిచారు.

అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి రావాలనుకుంటున్నారు. భీమిలి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లారని చెబుతున్నారు. అయితే గంటా మాత్రం.. ఈ సారి కూడా భీమిలి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఆయన పట్టుదలగా ఉన్నారు. కొద్ది రోజుల కిందట.. భీమిలి నుంచి ఆయనను మారుస్తారని ప్రచారం జరిగినప్పుడు.. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు కూడా..! అప్పుడు టీడీపీ నేతలు.. ఆయనకే భీమిలి టిక్కెట్ అని చెప్పి బుజ్జగించారు. దాంతో… ఎలాగైనా భీమిలి నుంచే పోటీ చేయాలన్న ఉద్దేశంతో అవంతి శ్రీనివాస్ ఇతర పార్టీల వైపు చూస్తున్నారని చెబుతున్నారు. మరి ఇది ఎంత వరకూ నిజం అవుతుందో మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close