బిజెపి లోకి వెళ్ళడానికి గంటా కు రంగం సిద్ధం: అవంతి శ్రీనివాస్

వైఎస్ఆర్సిపి నేత మరియు మంత్రి అవంతి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా బిజెపిలో చేరి పోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు . త్వరలోనే గంటా తెలుగుదేశం పార్టీ ని ముంచడం ఖాయం అంటూ ఆయన ఎప్పటినుండో చేస్తున్న వ్యాఖ్యలను మరొక్కసారి గుర్తు చేశారు. వివరాల్లోకి వెళితే..

గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ లోని మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలను తీసుకెళ్లి బిజెపిలోకి విలీనం చేస్తారని ఎన్నికల ఫలితాల అప్పటినుండి ప్రచారం జరుగుతోంది. అయితే గంటా శ్రీనివాసరావు ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం గంటా శ్రీనివాసరావు బిజెపి లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రస్తుతం ఢిల్లీలో కూర్చొని బిజెపి పెద్దలతో మంతనాలు జరుపుతున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే గంటా చేరికను బిజెపి రాష్ట్ర స్థాయి నాయకులు కొందరు వ్యతిరేకిస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. గంటా వస్తే పార్టీని మొత్తం తన చేతుల్లోకి తీసుకుంటాడని, పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయడని వారు బిజెపి పెద్దలకు నూరి పోస్తున్నట్లుగా సమాచారం.

రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ఈ ప్రచారాల మధ్య అవంతి శ్రీనివాస్, గంట శ్రీనివాస్ బీజేపీ ప్రయత్నాల మీద చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కాక పుట్టిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బాక్‌: ఎన్టీఆర్ కృష్ణ‌ల ‘కురుక్షేత్ర‌’ యుద్ధం

ఒకేరోజు.. రెండు సినిమాలు, అందునా స్టార్ సినిమాలు విడుద‌ల కావ‌డం కొత్తేం కాదు. కానీ.. రెండూ ఇంచుమించుగా ఒకే క‌థ‌తో విడుద‌లైతే, రెండూ ఒకే జోన‌ర్ అయితే.. ఎలా ఉంటుంది? ఆ...

రానా పెళ్లిలో… ప్ర‌భాస్ ‘బావ‌’ మిస్సింగ్‌

శ‌నివారం రాత్రి రానా -మిహిక‌లు అగ్ని సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. లాక్ డౌన్, క‌రోనా గొడ‌వ‌లు లేక‌పోతే, ఈ పెళ్లి ధూంధామ్‌గా జ‌రిగేది. కానీ లాక్ డౌన్ ప‌రిమితుల వ‌ల్ల కేవ‌లం 50మంది అతిథుల‌కే...

అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షలు : జగన్

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య పదకొండుకు చేరింది. అందరూ... కోవిడ్ రోగులే. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. దాదాపుగా యాభై మంది కోవిడ్ రోగులు ఆస్పత్రిలో ఉండగా.....

నాని సినిమాని సీక్వెల్ వ‌స్తోంది

వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్ స్థాపించి 'అ' సినిమాతో బోణీ కొట్టాడు నాని. నిర్మాత‌గా త‌న అభిరుచి ఎలాంటిదో తొలి సినిమాతోనే చూపించాడు. ప్ర‌శాంత్ వ‌ర్మ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేశాడు. 'అ' క‌మర్షియ‌ల్ గా...

HOT NEWS

[X] Close
[X] Close