ఏవీఎం నిర్మాణ సంస్థ అధినేత ఏవీఎం శరవణన్ వయోభారంతో 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1939లో జన్మించిన శరవణన్, ఏవీఎం స్థాపకుడు ఏ.వి. మేయప్పన్ కుమారుడు. 1979లో తండ్రి మరణించిన తర్వాత మొత్తం స్టూడియో, ప్రొడక్షన్ బాధ్యతలను ఆయన స్వయంగా చేపట్టారు.
శరవణన్ ని సౌత్ సినిమా టార్చ్ బేరర్ గా అభివర్ణిస్తుంటారు. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో శరవణన్ పలు హిట్ చిత్రాలను నిర్మించి గుర్తింపుతెచ్చుకున్నారు. ఏవీఎం బ్యానర్‌పై మొత్తం 300 సినిమాలకు పైగా నిర్మించారు. ‘సంసారం ఒక చదరంగం’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘మెరుపు కలలు’, ‘జెమిని’, ‘శివాజీ’ లీడర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులని అలరించారు. తమిళ్ లో అనేక క్లాసిక్ చిత్రాలు వారి నిర్మాణంలో వచ్చాయి.
శరవణన్ వారసుడిగా ఆయన కుమారుడు ఎం. ఎస్. గుహన్ నిర్మాతగా యాక్టివ్ గా వున్నారు. ఆయన మనవరాళ్లు అరుణ గుహన్, అపర్ణ గుహన్ AVM వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఏవీఎం ఇండియన్ సినిమాలో విడదీయరాని అనుబంధం వున్న సంస్థ. తండ్రి మేయప్పన్ తర్వాత శరవణన్ మృతితో రెండోతరం ముగిసినట్లయింది.