ఉయ్యాల‌వాడ‌కు బాహుబ‌లి వ్యూహం?

తెలుగు సినిమాకి కొత్త మార్కెటింగ్ పాఠాలు నేర్పించింది బాహుబ‌లి. ఓ సినిమాని ఏ స్థాయిలో మార్కెట్ చేసుకోవొచ్చో, ఎన్ని వ‌సూళ్లు అందుకొనేలా చేయొచ్చో… నిరూపించింది. బాహుబ‌లి ని స్ఫూర్తిగా తీసుకొని, తెలుగు సినిమా ఇప్పుడు కొత్త పుంత‌లు తొక్క‌డానికి వ్యూహాలు ర‌చిస్తోంది. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డికీ బాహుబ‌లి ఆద‌ర్శంగా నిల‌వ‌బోతోంది. చిరంజీవి – సురేంద‌ర్‌ర్‌రెడ్డి కాంబోలో తెర‌కెక్కుతున్న‌చిత్రం ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి. ఆగ‌స్టులో ఈచిత్రం ప్రారంభం కానుంది. మార్కెటింగ్ సూత్రాల విష‌యంలో బాహుబ‌లిని చిరు టీమ్ ఆద‌ర్శంగా తీసుకోబోతోంద‌ట‌. సినిమా విడుద‌ల తేదీ ప‌క్కాగా ఖ‌రారు చేసుకొని అందుకు నెల రోజుల ముందు నుంచే ముమ్మ‌రంగా ప‌బ్లిసిటీ చేయాల‌ని చిరు భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెల‌గుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని చూస్తున్నాడు చిరు. ఇదో.. చారిత్ర‌క నేప‌థ్యం ఉన్న చిత్రం. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉంది. ఆ విభాగంలో అంత‌ర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తే.. క‌చ్చితంగా బాలీవుడ్ మెప్పు పొందొచ్చ‌ని చిరు భావిస్తున్నాడ‌ని తెలుస్తోంది.

చిరుకి బాలీవుడ్ ప్రేక్ష‌కులు ప‌రిచ‌య‌మే. ఆజ్ కా గుండారాజ్‌, ప్ర‌తి బంధ్‌, ది జెంటిల్‌మెన్ సినిమాల‌తో అక్క‌డి ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకొనే ప్ర‌య‌త్నం చేశాడు. బాహుబ‌లి 1, బాహుబ‌లి 2 బాలీవుడ్ అద్భుత విజ‌యాన్ని సాధించాయి. అంత‌గా కాక‌పోయినా అందులో నాలుగో వంతు ఉయ్యాల వాడ నిల‌బ‌డితే చాలు.. చిరు ప్ర‌య‌త్నం ఫ‌లించిన‌ట్టే. మ‌ల‌యాళంలోనూ ఈ సినిమాని భారీ ఎత్తున విడుద‌ల చేయాల‌ని, ఆ రూపంలో మ‌ల్లూవుడ్‌లోనూ వ‌సూళ్లు కొల్ల‌గొట్టాల‌ని చిరు భావిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com