బాహుబ‌లి2 లో ఆ సీన్ వెనుక‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌?

బాహుబ‌లి 2లో ఇంట్ర‌వెల్ సీన్ గుర్తుంది క‌దా? భ‌ళ్లాల‌దేవ‌కు ప‌ట్టాభిషేకం జ‌రుగుతుంది. అదే స‌మ‌యంలో బాహుబ‌లి సైన్యాధిప‌తిగా ప్ర‌మాణ‌స్వీకారం చేస్తాడు. భ‌ళ్లాల‌దేవ సింహాస‌నం పై కూర్చున్న‌ప్పుడు చ‌ప్పుడు చేయ‌ని మాహీష్మ‌తీ ప్ర‌జ‌లు… సైన్యాధ్య‌క్షుడిగా బాహుబ‌లి ప్ర‌తిజ్ఞ చేస్తున్న‌ప్పుడు మాత్రం ఆవేశంగా రెచ్చిపోతారు. ఆ చ‌ప్పుళ్ల‌కు భ‌ళ్లాల‌దేవ సింహాస‌నం సైతం క‌దిలిపోతుంది. దాంతో… రాజునయ్యా అన్న సంతృప్తి, సంతోష‌కం కూడా భ‌ళ్లాల‌దేవ క‌ళ్ల‌లో మాయం అవుతుంది. ఈ స‌న్నివేశానికి స్ఫూర్తి.. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులేన‌ట‌. ఈ విష‌యాన్ని ర‌చయిత విజ‌యేంద్ర‌ప్ర‌సాదే స్వ‌యంగా అంగీక‌రించారు.

విష‌యం ఏంటంటే… ఈమ‌ధ్య ఆడియో పంక్ష‌న్ల‌లో ప‌వ‌న్ పేరెత్తితే చాలు.. అభిమానులు రెచ్చిపోతున్నారు. ఆ స‌భ‌లో ప‌వ‌న్ ఉన్నా, లేకున్నా.. ప‌వ‌ర్ స్టార్ – ప‌వ‌ర్ స్టార్ అంటూ గోల గోల చేస్తున్నారు. దాంతో ఎవ్వ‌రికీ మాట్లాడే అవ‌కాశం కూడా దొర‌క‌డం లేదు. వేదిక‌పై ఓ హీరో ఉన్న‌ప్పుడు, మ‌రో హీరో గురించి అభిమానులు కేక‌లు వేస్తే ఎవ్వ‌రికైనా జెల‌సీ వ‌స్తుంది. భ‌ళ్లాల‌దేవ పాత్ర‌లోనూ ఆ జెల‌సీ చూడాల్సిన సంద‌ర్భం బాహుబ‌లి 2 క‌థ‌లో వ‌చ్చింది. ఆ సీన్ రాస్తున్న‌ప్పుడు టీవీలో ఓ ఆడియో ఫంక్ష‌న్ వ‌స్తోంద‌ట‌. ఆ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమానులు గోల గోల చేయ‌డం, వేదిక పై ఉన్న హీరోలు చిన్న‌బుచ్చుకోవ‌డం విజ‌యేంద్ర ప్ర‌సాద్ గ‌మ‌నించాడ‌ట‌. త‌న క‌థకి, రాయ‌బోతున్న స‌న్నివేశానికీ ఆ సంద‌ర్భం న‌ప్ప‌డంతో… బాహుబ‌లి ఇంట్ర‌వెల్ సీన్ ఆ స్ఫూర్తితో డిజైన్ చేసుకొన్నార్ట‌. బాహుబ‌లి 2 విజ‌యంలో ఇంట్ర‌వెల్ సీన్ కూడా ఓ కీల‌క పాత్ర పోషించింది. అంటే పార్ట్ 2లో ప‌వ‌న్ పాత్ర ఉన్న‌ట్టే అనుకోవాల‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com