మరికొన్ని గంటలలోనే బాహుబలి విడుదల: ఆకాశాన్నంటుతున్న అంచనాలు

హైదరాబాద్: ఎప్పుడా ఎప్పుడా అని సినీ అభిమానులందరూ ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. బాహుబలి విడుదలకు రంగం అంతా సిద్ధమయింది. దర్శకుడు రాజమౌళి అత్యంత భారీవ్యయంతో రూపొందించిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 ధియేటర్లలో విడుదల కాబోతోంది.  నిర్మాణ దశనుంచి దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించిన బాహుబలిని చూడటానికి అభిమానులు తహతహలాడుతున్నారు. అంచనాలు పతాకస్థాయికి చేరాయి. వాటిని రాజమౌళి అందుకున్నారా, అధిగమించారా అనేది మరికొన్ని గంటలలో తేలబోతోంది.

బాహుబలి టిట్‌బిట్స్:

ఇది ద్విభాషా చిత్రం. తెలుగు, తమిళ భాషలలో రూపొందింది. ఇవికాక మళయాళం, హిందీ భాషలలోకి డబ్ అయింది. ఒకేసారి నాలుగు భాషలలో విడుదలవుతుంది.

రేపు విడుదలవుతున్న మొదటి భాగం, తర్వాత విడుదలయ్యే రెండవ భాగం కలిసి రు.250 కోట్లు ఖర్చు చేస్తున్నారు. దేశంలోనే అత్యంత భారీ చిత్రం ఇదే.

రేపు విడుదలవుతున్న మొదటి భాగం 2గం.35 నిమిషాలు ఉంటుంది.

మొత్తం 380 రోజుల షూటింగ్ జరిపితే అందులో 300 రోజులు యాక్షన్ సన్నివేశాలే చేశారు.

ప్రభాస్ రెండున్నర ఏళ్ళు ఈ చిత్రంకోసమే పనిచేశారు.

భళ్ళాలదేవ పాత్రకోసం రానా 88 కిలోలనుంచి 120 కిలోలు పెరిగాడు. అతని పాత్రకు ఆయుధం గద.

రాజమౌళి సినిమాలో గ్రాఫిక్స్‌కు ప్రత్యేక స్థానముంటుందని తెలిసిందే. ఈ చిత్రంలో 4,500నుంచి 5,000దాకా విజువల్ ఎఫెక్ట్స్ షాట్స్ ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ… ‘వీర ధీర శూర‌’

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడిగా విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఇందులో నారా రోహిత్, మంచు మ‌నోజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'వీర ధీర శూర‌' అనే...

అరికపూడి గాంధీ – కౌశిక్ రెడ్డి ఇష్యూ : హరీష్ రావుకు కేసీఆర్ కీలక ఆదేశాలు?

రెండు రోజులుగా తెలంగాణ రాజకీయాలను అట్టుడికేలా చేసిన కౌశిక్ రెడ్డి - అరికెపూడి గాంధీ వివాదంలో బీఆర్ఎస్ ఇక వెనక్కి తగ్గినట్టేనా? ఈ విషయంలో బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లు అయిందని కేసీఆర్...

చైతన్య : పంజరంలో సీబీఐని న్యాయవ్యవస్థ విడిపించగలదా ?

పంజరంలో చిలుకలా వ్యవహరించవద్దని సీబీఐని ఉద్దేశించి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ కు బెయిల్ ఇస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు....

రేవంత్‌ను తక్కువ అంచనా వేస్తే ఇంతే !

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు సార్లు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు, మూడు చోట్ల గెలవడానికి తంటాలు పడింది. ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close