టివి లో బాహుబలి!

మలయాళీ టీవీ చానల్ మళవిల్ మనోరమ ‘బాహుబలి’ సినిమాను త్వరలో ప్రసారం చేయబోతోంది. కేరళలో ఈ చానల్ కు అతిపెద్ద కనెక్టివిటీ వుంది. చానల్ లో ఇప్పటికే బాహుబలి ప్రమోలు ప్రసారమౌతున్నాయి తెలుగుతో బాటు హిందీ, తమిళం , మలయాళంలో విడుదలైన ఈ చిత్రం శాటిలైట్ ప్రసారహక్కులు కొనుగోలు చేసిన మళవిల్ మనోరమ ప్రసారతేదీని త్వరలో అని మాత్రమే చెబుతోంది.

గతంలో రాజమౌళి మగధీర, ఈగ సినిమాలను కూడా ఇదే చానల్ ప్రసారం చేసింది.భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారని దేశంలోనే అత్యధిక సర్కులేషన్ వున్న భాషా దినపత్రిక మళయాళ మనోరమ గ్రూప్ లోని ఈ ఛానల్ మార్కెటింగ్ విభాగం అంచనా వేస్తోంది. మగధీర, ఈగ సినిమాల అనుభవంతో వాటికంటే బాహుబలి వ్యూయర్ షిప్ చాలా ఎక్కువగా వుంటుందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com