సెటైర్:`నెట్’ దొరక్క చావులు!

ఫేక్ న్యూస్ ఛానెల్ లో వార్తలొస్తున్నాయి.

యాంకర్ నాగ్ : ఎప్పటికప్పుడు న్యూస్ ని తాజాగా వండి వారుస్తున్న ఫేక్ న్యూస్ 999కు స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉండగానే ఇటు కేంద్రప్రభుత్వం చాలా విచిత్రంగా ఇంటర్నెట్ వాడకంపై నిషేధం విధిస్తూ కొత్త జీవో విడుదలచేసింది. దీని ప్రభావం ఎలా ఉన్నదో రిపోర్టర్ ప్రేమ్ ని అడిగి తెలుసుకుందాం. హలో … ప్రేమ్… వినబడుతుందా…?

రిపోర్టర్ ప్రేమ్ : వినబడుతోంది నాగ్.

నాగ్ : చెప్పండి ప్రేమ్… కేంద్రం ఉన్నట్టుండి నిన్న అర్థరాత్రి నుంచి నెట్ సేవలను ఉపసంహరించుకుందికదా… దీని ప్రభావం ప్రజలపై ఎలా ఉంది ?

ప్రేమ్ : నెట్ సేవలు పూర్తిగా ఆగిపోవడంతో ఇక్కడంతా గందరగోళంగానూ, ఆందోళనకరంగానూ, ఉద్రిక్తంగానూ ఉంది నాగ్.

నాగ్ : భేష్.. ఆందోళనకరంగా ఉందంటూ చాలా శుభకరంగా న్యూస్ రిపోర్టింగ్ ప్రారంభించావ్. ఇక లాగించేయ్ ప్రేమ్. ఏమిటీ ఆందోళనకరంగా ఉందీ ? ఎక్కడ ఉద్రిక్తంగా ఉంది ? మరి వారి పరిస్థితి ఎలా ఉంది??

ప్రేమ్ : కేంద్రం ఉన్నట్టుండి నెట్ సేవలను రద్దుచేయడంతో చాలా చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 24గంటలూ నెట్ ఆధారిత కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫేస్ బుక్, వాట్సప్ వంటి యాప్స్ నొక్కుకుంటూ మెసేజెస్, ఇమేజెస్, వీడియోల్లాంటివి పంపుకునేవారి చేతులకు పనిలేకపోవడంతో నెట్ జెన్లు పిచ్చిచేష్టలు చేస్తున్నారు నాగ్.

నాగ్ : ఇంతకీ నువ్వు ఎక్కడున్నావ్ ప్రేమ్ ? నెట్ దొరక్క అల్లాడుతున్న నెట్ జెన్ల మనోభావాలు ఎలా ఉన్నాయ్ ?

ప్రేమ్ : నేనిప్పుడు ఐటీ కారిడార్ లోని ఆస్పత్రి దగ్గరున్నాను . ఇక్కడ అవుట్ పేషెంట్ , ఇన్ పేషెంట్ వార్డులన్నీ నెట్ దొరక్క అవస్థలు పడుతున్న వారితో నిండిపోయాయ్ నాగ్. ఇదిగో మనం ఇక్కడ చూస్తున్నాం… ఇన్ పేషెంట్ వార్డ్ ఇది. మంచాలన్నీ నెట్ దొరక్క రోగాలు తెచ్చుకున్న వారితో నిండిపోయాయి. వీరంతా పిచ్చిచేష్టలు చేయడం మనమిక్కడ చూడవచ్చు . ఇదిగో ఈ వ్యక్తి మంచి సంపన్నవర్గానికి చెందినవాడు. ఇతని జేబులో నాలుగు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకదాంట్లో కాకపోతే మరొకదాంట్లో నెట్ వస్తుందన్న పిచ్చి భ్రమలో నాలుగు ఫోన్లును నొక్కుకుంటూ కూర్చున్నాడు. ఇక ఇటు చూస్తే, ఈ పేషెంట్ ని మంచం కోళ్లకు తాడుతో కట్టేశారు. చేతులు రెండూ బిగించి కట్టేశారు. అయినప్పటికీ పిచ్చి చేష్టలు తగ్గడంలేదు నాగ్. ఇతని చేతులు వొంకర్లు పోతున్నాయి. ఎవరో చేతబడి చేసినట్టు, కాష్మారోలాంటి క్షుద్రశక్తి ప్రయోగించినట్టు పళ్లు పటపటా కొరుకుతున్నాడు, నోటి నుంచి నురుగువస్తోంది. కళ్లు గిరగిరాతిప్పుతున్నాడు. ఫేస్ బుక్…వాట్సప్ అంటూ తెగకలవరిస్తున్నాడు నాగ్.

నాగ్ : మరి డాక్టర్లు ఏమంటున్నారు ప్రేమ్ ?

ప్రేమ్ : నెట్ దొరక్క పోవడంతో వారి పరిస్థితి అలాగే ఉంది నాగ్. ఒక మందు రాయబోయి, మరో మందు రాయడంతో ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

నాగ్ : ఉద్రిక్తత ఏమన్నా చోటుచేసుకుందా ప్రేమ్ ?

ప్రేమ్ : నువ్వు తొందరపడకు నాగ్. ఎలాగో మనమిచ్చే ప్రతి న్యూస్ లో ఉద్రిక్తత, తొక్కిసలాట తప్పకుండా ఉంటాయి. పేషెంట్ల తల్లిదండ్రులు, బంధువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేకమంది నెట్ దొరక్క చనిపోతున్నట్టు కూడా వార్తలొస్తుండటంతో ప్రతిఒక్కరిలోనూ భయం చోటుచేసుకుంటున్నది.

నాగ్ : (ప్రేక్షుకలవైపు తిరిగి) ప్రధానమంత్రి మోదీ దేశంలో లేనప్పుడు ఉన్నట్టుండి కుట్రపూరితంగా డిజిటల్ ఇండియాకు వ్యతిరేకంగా నెట్ సేవలను రద్దుచేయడంపై ప్రజలు విరుచుకుపడుతున్నారు. మోదీ అసమర్థపాలనకు ఇది నిదర్శనమంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాగా, మోదీ ప్రభుత్వాన్ని కూల్చడంకోసం కొంతమంది కుట్రపన్నారనీ, వారిని గుర్తించి తగుచర్యలు తీసుకుంటామని బిజేపీ అధికార ప్రతనిధి ఒకరు తెలియజేస్తున్నారు. మోదీకి తెలియకుండానే నెట్ బ్యాన్ జీవో వచ్చేసిందని అంటున్నారు. ఇది ఇలాఉండగా, మన రాష్ట్రంలో నెట్ దొరక్క పిచ్చెక్కి అనేకమంది మానసిక రోగులుగా మారిపోతుంటే, మరికొంతమంది మరణించినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేమ్…చెప్పండి, నీదగ్గరున్న సమాచారం ఏమిటి ?

ప్రేమ్ : ఇక్కడ నాదగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నారు నాగ్. ఆయన మాత్రం హర్షం వెలుబుచ్చుతున్నారు. నెట్ సౌకర్యం ఆగిపోవడంతో పాదచారులు, డ్రైవ్ చేస్తున్నవారు తమ చేతుల్లో స్మార్ట్ ఫోన్లలో నెట్ లేకపోవడంతో శ్రద్ధగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారనీ, దీంతో ప్రమాదాలు తగ్గుతున్నాయని అంటున్నారు నాగ్. ఇక, ఆస్పత్రి గేటు దగ్గరకు వెళదాం . అక్కడో పెద్దాయన నెట్ అందక పిచ్చెక్కి పాట అందుకున్నాడు…

`మాటలకని వైఫెందుకురా… వైఫైయ్యే చాలు… లలలా…. లలలా..ఇహ్హీహ్హీ…ఒహ్హోహ్హో… ‘

ఇతనొక్కడే కాదు నాగ్, చాలామంది పరిస్థితి చేయిదాటిపోయేలాఉంది. ఇక్కడ నాదగ్గర డాక్టర్ మరువం గారున్నారు. ఆయనను అడిగి వాస్తవ పరిస్థితులు తెలుసుకుందాం. చెప్పండి డాక్టర్ మరువం గారూ…

` నెట్ దొరక్కపోవడంతో మానసిక స్థితి మారిపోతున్నది. ఇదో వైరల్ గా వ్యాపిస్తోంది. నెట్ ఉన్నప్పుడు ఓ రకమైన రోగాలు వస్తుంటే నెట్ దొరక్కపోవడం వల్ల మరిన్ని వింతలక్షణాలు బయటపడుతున్నాయి. మానవ నాగరికత చరిత్రలో నెట్ అన్నది ఈమధ్యనే చోటుచేసుకున్నప్పటికీ, ఇది చాలా స్పీడ్ గా స్ప్రెడ్డై పోతోంది. దీనివల్ల జెనిటికల్ మ్యుటేషన్స్ త్వరగావచ్చిసి కొత్త మానవజాతి ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ జాతిపేరు ఆ జాతిని `హోమో నెట్టర్స్’ అని పిలవొచ్చు. ఆ కొత్త జాతి ప్రాధమిక లక్షణాలే మనమిప్పుడు వీరిలో చూస్తున్నాం ‘

నాగ్ : (ప్రేక్షకులవైపు తిరిగి) నెట్ దొరక్క పిచ్చివాళ్లవుతున్న సంఖ్య కోట్లకు చేరింది. వారిలో చాలామంది మృత్యువుతో పోరాడుతున్నట్టు తెలుస్తోంది. కాగా, నెట్ పిచ్చితో కొత్త మానవజాతి ఆవిర్భవిస్తుందని డాక్టర్ మరువం గారు చెబుతున్నారు. ఇప్పుడే అందిన వార్త… మా ఛానెల్ ఎండీగారిలో కూడా ఈ కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయట. ఆయన్ని ఇప్పుడే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. (రిపోర్టర్ తో) ప్రేమ్… నువ్వు వెంటనే కెమేరామెన్ తో పాటు ఉస్మానియా ఆస్పత్రికి వచ్చేయ్…

ప్రేమ్ : హీహ్హీ…హిహ్హీ…ఓహ్హోహ్హో… లాలాలాలా…

నాగ్: ఓహ్హోహ్హో.. ఇహ్హీహ్హీ… ఏదీ నా ఫేస్ బుక్…ఇహీహ్హీ…ఏదీ నా వాట్సప్ కనబడదే… లంబడగింబడ జంబా…దాని దింబడ…హ్హోహ్హోహ్హో….

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ విషయంలో విచారణకు ఆదేశించిన నిమ్మగడ్డ..!

స్టేట్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో చేసిన వాస్తు మార్పులపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సీరియస్ అయ్యారు. ఎవరు చెబితే ఆ మార్పులు చేశారో తనకు తెలియాలంటూ..విచారణకు ఆదేశించారు. నిమ్మగడ్డ తన ఆఫీసులో జరిగిన...

అమరావతిని కొనసాగిస్తే పదవుల్ని ఇచ్చేస్తాం..! జగన్‌గు చంద్రబాబు ఆఫర్..!

అమరావతిని ఏకైక రాజధాని కొనసాగిస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ పదవులను వదిలేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు.. ముఖ్యమంత్రి జగన్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికలకు ముందు...

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్..!

జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతి రోజే...అంటే జూన్ 13న హైదరాబాద్‌లో వారిని అరెస్టు చేసిన పోలీసులు అనంతపురంకు తరలించారు....
video

క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్‌: బ్లాక్ అండ్ వైట్ కాంబో

https://www.youtube.com/watch?v=T-R3h9va2j4&feature=emb_title ప్రేమ గుడ్డిది. చెవిటిది. మూగ‌ది కూడా. దానికి ప్రేమించ‌డం త‌ప్ప బేధాలు తెలీవు. న‌ల్ల‌ని అబ్బాయి.. తెల్ల‌ని అమ్మాయి ప్రేమించుకోవ‌డం కూడా వింతేం కాదు. కానీ.. మ‌ధ్య‌లోకి ఓ పులి వ‌చ్చింది....

HOT NEWS

[X] Close
[X] Close