బాహుబలికి `తమిళ పులి’ బెదరింపు

భారీ బడ్జెట్ తో తీసిన `బాహుబలి’ సినిమా కథలో దళితులను కించపరిచే డైలాగ్ లుఉన్నాయా ? వారి మనోభావాలు దెబ్బతినేలా కొన్ని సన్నివేశాలున్నాయా ? తమిళనాడులోని మధురై లో బాహుబలి తమిళ వర్షెన్ ఆడుతున్న థియేటర్ ఎదుట కొంత మంది పెట్రోల్ బాంబు ప్రేల్చిన సంఘటనతో ఇప్పుడు ఈ ప్రశ్నలు వేసుకోవాల్సి వస్తున్నది. ఒకసారి సినిమా కథను మననం చేసుకోవాల్సి వస్తున్నది.
బాహుబలి సినిమా ఇటు తెలుగుతో పాటుగా అటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోకూడా విడుదలైంది. తమిళనాడులో ఉన్నట్టుండి `మనోభావాల సమస్య’ ఇప్పుడు ఈ రూపంలో తారాస్థాయికి చేరుకుంది. చిత్రనిర్మాతలు వెంటనే అభ్యంతరకరమైన డైలాగ్ లను తీసేయాలని దళిత సంబంధిత సంస్థ `పురాట్చి పులికల్ ఇయక్కమ్’ కు చెందిన కార్యకర్తలు ద్విచక్రవాహనాలమీద సినిమా థియేటర్ దగ్గరకు వచ్చి పెట్రోల్ బాంబులు విసేరేశారు. పెట్రోల్ నింపిన సీసాల్లో ఒకటి థియేటర్ గోడకు తగిలింది. ఆ సమయంలో థియేటర్ లో బాహుబలి చిత్ర ప్రదర్శన జరుగుతోంది. ఎలాంటి ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులు అక్కడకు వెళ్ళి ప్రాధమిక విచారణ చేపట్టారు.
కాగా, ఈ సంస్థకు చెందిన ఏడుగురు వ్యక్తులు తళ్ళాకులమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ సంఘటనకు తామే బాధ్యులమని చెబ్తూ లొంగిపోయారు. చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాలు, డైలాగ్ లు ఉన్న వీడియో క్లిప్పింగ్స్ ను అప్పగిస్తూ, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. దళిత వర్గాలను కించపరిచేలా కొన్ని డైలాగ్ లు ఉన్నాయని తమిళనాడులోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్.సి, ఎస్టీ సంస్థలు కూడా డిమాండ్ చేయడం గమనార్హం. అభ్యంతరకరమైన డైలాగ్ లను ఎడిట్ చేయాలని ఈ సంస్థలు కోరుతున్నాయి. అయితే, చిత్ర నిర్మాతలు ఈ అభ్యంతరాలను పరిశీలించి ఇంతవరకు చర్యలు తీసుకోలేదనే చెప్పాలి.
మధురై  సంఘటనపై చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. బహుభాషా చిత్రంమైన బాహుబలి ఇప్పటికే ఇండియాలో 250 కోట్ల దాకా వసూళ్లు చేసి రికార్డు సృష్టించిన సంగతి విదితమే.
ఈ మధ్యకాలంలో ఏ సినిమా రిలీజ్ అయినా ఉన్నట్టుండి ఫిర్యాదులు తలెత్తడం కామనైపోయిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. నెగెటీవ్ పబ్లిసిటీ వల్ల కూడా తమ సినిమాకు డిమాండ్ పెరుగుతుందన్న ఉద్దేశంతో కొన్ని సినిమాల నిర్మాతలే ఇలాంటి కేసులు పడేలా చూస్తున్నారన్న విమర్శలు కూడా సినీ వర్గాల్లో వినబడుతోంది. అయితే, బాహుబలి ఆ పరిధిలోకి రాదనీ, సినిమావిడుదలకు ముందే తిరుగులేని ప్రచారం ఈ చిత్రానికి లభించిందన్న సంగతి వారు ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు.
మొత్తానికి సాఫీగా సాగుతున్న బాహుబలికి ఇప్పుడు తమిళ దళిత వర్గాల నుంచి బెదరింపులు రావడంతో, సినిమా కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇదంతా ఎలా ఉన్నా,  బానిస బతుకుల్లో మార్పు రాదన్న అర్థం వచ్చేలా సాగే సన్నివేశాలు, మాటలు ఉండటం సరైన పద్ధతి కాదని నిర్మాతలు గ్రహించాలని దళిత వర్గాలు కోరుకోవడాన్ని అర్థంచేసుకోవాలి.  అభ్యంతరకరమైన సన్నివేశాలున్నాయని అంటున్న వారికి మరి నిర్మాతలు ఎలాంటి సమాధానం చెబుతారో ఎలాంటి చర్య తీసుకుంటారో వేచిచూడాలి.
-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close